ఫోన్‌ స్టోరేజ్‌ నిండిపోతోందా?

ABN , First Publish Date - 2020-07-18T05:30:00+05:30 IST

ప్రతి ఒక్కరి స్మార్ట్‌ఫోన్‌లో కనీసం ఐదారు వాట్సప్‌ గ్రూపులుంటాయి. రోజూ పదుల సంఖ్యలో ఫోటోలు, వీడియోలు వచ్చి చేరుతూనే ఉంటాయి. దానికి తోడు డౌన్‌లోడ్‌ చేసుకున్న....

ఫోన్‌ స్టోరేజ్‌ నిండిపోతోందా?

ప్రతి ఒక్కరి స్మార్ట్‌ఫోన్‌లో కనీసం ఐదారు వాట్సప్‌ గ్రూపులుంటాయి. రోజూ పదుల సంఖ్యలో ఫోటోలు, వీడియోలు వచ్చి చేరుతూనే ఉంటాయి. దానికి తోడు డౌన్‌లోడ్‌ చేసుకున్న ఫైల్స్‌, ఇష్టంగా తీసుకున్న ఫొటోలు.  ఫలితం... స్టోరేజ్‌ ఫుల్‌ అని మెసేజ్‌. మరి ఫోన్‌లో స్టోరేజ్‌ స్పేస్‌ను మేనేజ్‌ చేసేదెలా? అంటే... ఇలా చేయండి.


వాట్సప్‌ డేటా పని పట్టండి


వాట్సప్‌లో వచ్చే ఫొటోలు, వీడియోలతో స్పేస్‌ చాలా వేస్ట్‌ అవుతూ ఉంటుంది. అలా అని ఒక్కోఫొటోని చూసుకుంటూ డిలీట్‌ చేయాలంటే కష్టమే. అలాకాకుండా వాట్సప్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి డేటా అండ్‌ స్టోరేజ్‌ యూసేజ్‌ ఆప్షన్‌ని ఎంచుకోవాలి. స్టోరేజ్‌ యూసేజ్‌లో మీరు గ్రూపు లేదా వ్యక్తిని ఎంచుకోవాలి. అప్పుడు మీకు వీడియోలు, ఫొటోలు, టెక్స్ట్‌, పీడీఎఫ్‌, ఆడియో అన్ని రకాల ఫైల్స్‌ కనిపిస్తాయి. అక్కడే కుడివైపు కిందిభాగంలో ఫ్రీ అప్‌ స్పేస్‌ ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా వాటిలో ఏవి కావాలంటే వాటిని డిలీట్‌ చేయవచ్చు. 





క్యాచెను క్లీన్‌ చేయండి


చాలా ఆండ్రాయిడ్‌ యాప్స్‌ యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌ కోసం కొంత డేటాను స్టోర్‌ చేస్తుంటాయి. ఈ క్యాచ్డ్‌ డేటా కొద్దిపాటి సమయాన్ని ఆదా చేస్తుంది. ఈ ఫైల్స్‌ యాప్‌ క్యాచె్‌సలో స్టోర్‌ అవుతుంటాయి. అయితే ఈ ఫైల్స్‌ తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం లేదు. ఇవి ఫోన్‌లో స్టోరేజ్‌ స్పేస్‌ను ఆక్రమిస్తుంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు క్యాచె్‌సని క్లియర్‌ చేస్తూ ఉండాలి. ఇందుకోసం సెట్టింగ్స్‌ ఆప్షన్‌లోకి వెళ్లాలి. తరువాత యాప్స్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి. ఇప్పుడు మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ అయి ఉన్న యాప్స్‌ కనిపిస్తాయి. ఏదైనా ఒక యాప్‌పై క్లిక్‌ చేస్తే యాప్‌ ఇన్ఫో ఓపెన్‌  అవుతుంది. అందులో స్టోరేజ్‌ బటన్‌పై క్లిక్‌ చేస్తే క్లియర్‌ క్యాచె ఆప్షన్‌ కనిపిస్తుంది. దాన్ని ఎంచుకోవడం ద్వారా క్యాచెను క్లియర్‌ చేయవచ్చు. ఇలా ఒక్కో యాప్‌ను కాకుండా ఫోన్‌లో ఉన్న మొత్తం క్యాచెను క్లియర్‌ చేయాలంటే సెట్టింగ్స్‌లో స్టోరేజ్‌ ఆప్షన్‌ను ఎంచుకుని క్యాచ్డ్‌ డేటాపై క్లిక్‌ చేయడం ద్వారా మొత్తం ఒకేసారి క్లీన్‌ అవుతుంది. 


డౌన్‌లోడ్స్‌పై లుక్కేయండి!


కొన్ని పీడీఎఫ్‌ ఫైల్స్‌ను ఓపెన్‌ చేసి చూడాలనుకున్నప్పుడు అవి ముందుగా మీ ఫోన్‌లో డౌన్‌లోడ్‌ అయ్యాకే ఓపెన్‌ అవుతాయి. అలా డౌన్‌లోడ్‌ అయిన ఫైల్స్‌ ‘మై ఫైల్స్‌’ అనే ఫోల్డర్‌లో ఉంటాయి. వాటిలో చాలావరకు మీకు 

అవసరం లేని ఫైల్స్‌ ఉంటాయి. అలాంటి వాటిని చూసి తొలగించండి.


అవసరం లేని యాప్స్‌...


ఫోన్‌లో చాలా యాప్స్‌ ఇన్‌స్టాల్‌ చేసుకుని ఉంటారు. అందులో రెగ్యులర్‌గా ఉపయోగించేవి కొన్ని మాత్రమే ఉంటాయి. కొన్ని యాప్స్‌ను అసలు ఎప్పుడు వాడనే వాడరు. అలాంటి వాటిని గుర్తించి అన్‌ఇన్‌స్టాల్‌ చేయండి. అలాగే స్టోరేజ్‌ ఎక్కువగా తీసుకుంటున్న యాప్స్‌ను గుర్తించి వాటిని ఎస్‌డీ కార్డులోకి మూవ్‌ చేయండి.




గూగుల్‌ ఫోటోస్‌ను ఉపయోగించుకోండి!


మీరు మీ స్మార్ట్‌ఫోన్‌తో తీసిన ప్రతి ఫోటోని గూగుల్‌ ఫోటోస్‌లో బ్యాకప్‌ పెట్టుకోవచ్చు. ఒకసారి బ్యాకప్‌ తీసుకుంటే డివైజ్‌లో ఉన్న ఫొటోలను డిలీట్‌ చేసి స్పేస్‌ను ఫ్రీ చేసుకోవచ్చు. ఇందుకోసం చేయాల్సిందల్లా గూగుల్‌ ఫోటోస్‌లో బ్యాకప్‌ అండ్‌ సింక్రనైజ్‌ ఫీచర్‌ని ఆన్‌లో పెట్టుకోవడమే. గూగుల్‌ ఫొటోస్‌ యాప్‌పై క్లిక్‌ చేసి సెట్టింగ్స్‌లో బ్యాకప్‌ అండ్‌ సింక్రనైజ్‌ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. హైక్వాలిటీ రెజల్యూషన్‌ ఎంచుకుంటే గూగుల్‌ ఫొటోస్‌ అన్‌లిమిటెడ్‌ స్టోరేజ్‌ను అందిస్తుంది.

Updated Date - 2020-07-18T05:30:00+05:30 IST