అంగన్‌వాడీలకు స్మార్ట్‌ఫోన్లు ఇవ్వాలి

ABN , First Publish Date - 2021-04-10T06:48:38+05:30 IST

అంగన్‌వాడీలకు నూతన టెక్నాలజీతో కూడుకున్న స్మార్ట్‌ఫోన్లు అందజేయాలని శుక్రవారం అంగన్‌వాడీ సంఘం ఆధ్వర్యంలో ఐసీడీ ఎస్‌ పీవోకు వినతిపత్రాన్ని అందించారు.

అంగన్‌వాడీలకు స్మార్ట్‌ఫోన్లు ఇవ్వాలి
వినతిపత్రం అందజేస్తున్న అంగన్‌వాడీలు

నిర్మల్‌ కల్చరల్‌, ఏప్రిల్‌ 9 : అంగన్‌వాడీలకు నూతన టెక్నాలజీతో కూడుకున్న స్మార్ట్‌ఫోన్లు అందజేయాలని శుక్రవారం అంగన్‌వాడీ సంఘం ఆధ్వర్యంలో ఐసీడీ ఎస్‌ పీవోకు వినతిపత్రాన్ని అందించారు. గత మూడేళ్ల క్రితం అతితక్కువ జిల్లా లకు తక్కువ సామర్థ్యం గల సెల్‌ఫోన్లు ఇచ్చారని పేర్కొన్నారు. నెల సరిపడా బ్యాలెన్స్‌కు డబ్బులు చెల్లించాలని, ఆన్‌లైన్‌ సర్వేపై శిక్షణ, పెండింగ్‌ వేతనాలు, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరారు. నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-10T06:48:38+05:30 IST