Advertisement
Advertisement
Abn logo
Advertisement

వర్క్ పర్మిట్ల బదిలీ విషయమై కువైట్ కీలక నిర్ణయం!

కువైట్ సిటీ: చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో(ఎస్ఎంఈ) పనిచేసే కార్మికులు తమ వర్క్ పర్మిట్లను ఇకపై ఏడాదికే బదిలీ చేసుకోవచ్చని కువైట్ వాణిజ్య, పరిశ్రమల శాఖమంత్రి డాక్టర్ అబ్దుల్లా అల్ సల్మాన్ వెల్లడించారు. ఇంతకుముందు ఈ కాలపరిమితి మూడేళ్లుగా ఉండేది. దీన్ని తాజాగా మంత్రిత్వశాఖ ఏడాదికి కుదించినట్లు మంత్రి తెలిపారు. ఈ ఆదేశాలు వెంటనే అమలులోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు. అయితే, వర్క్ పర్మిట్ బదిలీ కోసం ఉద్యోగి తన పాత యజమాని అనుమతి తీసుకోవడం తప్పనిసరి అని తెలియజేశారు. లేబర్‌లకు అధిక డిమాండ్ ఉండటంతో పాటు చెల్లుబాటు అయ్యే వర్క్ పర్మిట్ లేని ఎవరికైనా కొత్త వీసాలు లేదా వర్క్ పర్మిట్లు జారీ చేయడంపై నిషేధం కారణంగా కార్మిక మంత్రిత్వశాఖ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలాఉంటే.. గతేడాది ఆగస్టులో ప్రస్తుత సంవత్సరం చివరి వరకు వేతన బదిలీ ధృవీకరణ పత్రాన్ని జతచేయవలసిన అవసరం లేకుండా ఎస్ఎంఈల మధ్య కార్మిక బదిలీని అనుమతించాలని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ (పీఏఎం) డైరెక్టర్ అహ్మద్ అల్ మౌసా ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. 

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement