హాయిగా నవ్వండి!

ABN , First Publish Date - 2021-04-14T05:30:00+05:30 IST

కరోనా మహమ్మారి, వరుస లాక్‌డౌన్‌లు మనందరి జీవనశైలిని చాలా మార్చేశాయి. ఇలాంటి కష్టకాలం బయటపడేందుకు ‘నవ్వుల థెరపీ’ బాగా పనిచేస్తుందని చెబుతున్నారు బాలీవుట్‌ నటి ప్రీతీ జింతా

హాయిగా నవ్వండి!

కరోనా మహమ్మారి, వరుస లాక్‌డౌన్‌లు మనందరి జీవనశైలిని చాలా మార్చేశాయి. ఇలాంటి కష్టకాలం బయటపడేందుకు ‘నవ్వుల థెరపీ’ బాగా పనిచేస్తుందని చెబుతున్నారు బాలీవుట్‌ నటి ప్రీతీ జింతా. ‘‘నవ్వడం అనేది ఎల్లప్పుడూ చక్కని ఔషధంగా పనిచేస్తుంది. ముఖ్యంగా మనం బాగా ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా మరిన్ని లాక్‌డౌన్‌లలో బంఽధీ అయినప్పుడు నవ్వుతో ఉపశమనంగా అనిపిస్తుంది’’ అంటుందీ బాలీవుడ్‌ బ్యూటీ. 


నవ్వు మనలోని భయాలను పోగొడుతుంది. ఒత్తిడి, ఉద్రేకాలను తగ్గిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. గట్టిగా నవ్వినప్పుడు ఉత్సాహాన్ని కలిగించే ఎండార్ఫిన్‌ రసాయనం విడుదలవుతుంది. ఈ రసాయనం మనసును తేలికపరుస్తుంది. నొప్పి, బాధ నుంచి బయటపడేస్తుంది అంటున్నారు మానసిక నిపుణులు.

Updated Date - 2021-04-14T05:30:00+05:30 IST