బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నేరం

ABN , First Publish Date - 2021-03-02T04:49:13+05:30 IST

బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నేరమని జిల్లా పొగాకు నియంత్రణ అధికారి శ్రీకాంత్‌ అన్నారు.

బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నేరం

ఆదిలాబాద్‌టౌన్‌, మార్చి1: బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నేరమని జిల్లా పొగాకు నియంత్రణ అధికారి శ్రీకాంత్‌ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌, తిరుమల పెట్రోల్‌బంక్‌, కలెక్టర్‌చౌక్‌, జడ్పీ, రిజిస్ర్టేషన్‌ కార్యాలయాల పరిధితో పాటు సంజయ్‌నగర్‌, టైలర్స్‌ కాలనీ, తదితర ప్రాంతాల్లో ఆయా దుకాణాలు, పాన్‌షాపుల్లో తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా జన సమూహానికి పొగాకు నియంత్రణపై, ధూమపానంపై అవగాహన కల్పించారు. బహిరంగ ధూమపానం నేరమని, పొగాకు ఉత్పత్తులను అమ్మరాదన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే జరిమానాలతో పాటు శిక్ష పడుతుందని హెచ్చరించారు. ఇందులో తనిఖీ బృందం సభ్యులు చిరంజీవి, దామోదర్‌, గోకంటి ఆశన్న పాల్గొన్నారు.

Updated Date - 2021-03-02T04:49:13+05:30 IST