‘పెళ్లి’ పై స్మృతి ఇరానీ Post.. నవ్వకుండా ఉండలేరు..

ABN , First Publish Date - 2021-07-23T21:23:23+05:30 IST

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా... శుక్రవారం ఆమె ఓ పోస్ట్ చేశారు. పెళ్లి చేసుకునే వారికి ఓ సలహా అంటూ పోస్ట్ చేసి,

‘పెళ్లి’ పై స్మృతి ఇరానీ Post.. నవ్వకుండా ఉండలేరు..

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా... శుక్రవారం ఆమె ఓ పోస్ట్ చేశారు. పెళ్లి చేసుకునే వారికి ఓ సలహా అంటూ పోస్ట్ చేసి, అందర్నీ నవ్వించారు. ‘‘ఏ వ్యక్తినైనా పెళ్లి చేసుకునే ముందు ఇంటర్నెట్ చాలా స్లోగా ఉండే కంప్యూటర్ ముందు కూర్చోబెట్టాలి. దీనిని బట్టి ఆయన వ్యక్తిత్వం ఏంటి అనేది ఇట్టే గ్రహించవచ్చు’’ అంటూ పోస్ట్ చేశారు. మరో పోస్ట్ కూడా చేశారు. ‘ఆంటీ సలహా’ అంటూ... ‘‘ఏ పదార్థమూ పర్‌ఫెక్ట్ గా ఉండదు. దానిని మనకు తగ్గట్టుగా మలుచుకోవాలి’’ అంటూ స్మృతి ఇరానీ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 



Updated Date - 2021-07-23T21:23:23+05:30 IST