పాము నోట్లోకి ఊపిరి ఊదిన యువకుడు

ABN , First Publish Date - 2021-06-18T21:20:59+05:30 IST

అపస్మారక స్థితిలో ఉన్న పాముకు ఓ యువకుడు శ్వాస అందించి దాని ప్రాణాలు నిలిపాడు.

పాము నోట్లోకి ఊపిరి ఊదిన యువకుడు

మనిషి ప్రాణం పోతున్న సమయంలో నోట్లోకి ఊపిరి ఊది ప్రాణాలు నిలిపిన దృష్యాలు ఇప్పటి వరకు పలు సినిమాల్లో చూశాం. అయితే అపస్మారక స్థితిలో ఉన్న పాముకు ఓ యువకుడు శ్వాస అందించి దాని ప్రాణాలు నిలిపాడు. స్ట్రా సహాయంతో పాము నోట్లోకి ఊపిరి ఊదాడు. 15 నిముషాల తర్వాత పాము కోలుకోవడంతో శ్వాస అందించిన యువకుడితోపాటు మిగతావారు సంతోషించారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో ఖచ్చితంగా తెలియదు కానీ, వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Updated Date - 2021-06-18T21:20:59+05:30 IST