సంఘమిత్ర భవనంలో పాముల కలకలం

ABN , First Publish Date - 2021-11-14T06:12:28+05:30 IST

చౌటుప్పల్‌ పట్టణంలోని మహిళా సమాఖ్య (సంఘమిత్ర) భవనం లో పాముల క లకలం నెలకొంది.

సంఘమిత్ర భవనంలో పాముల కలకలం
చౌటుప్పల్‌ లోని మహిళా సమాఖ్య భవనం

 భయాందోళనలో సిబ్బంది

చౌటుప్పల్‌టౌన, నవంబ రు 13: చౌటుప్పల్‌ పట్టణంలోని మహిళా సమాఖ్య (సంఘమిత్ర) భవనం లో పాముల క లకలం నెలకొంది. గత సెప్టెంబ రు నాలుగో తేదీ న కురిసిన భారీ వర్షానికి వచ్చిన వరదతో మహిళా సమాఖ్య భవనంలో కి నీరు చేరుకుంది. చెరువు ఒడ్డున గల మహిళా సమాఖ్య కార్యాలయంలోకి వరద నీరు చేరుకోవడంతో లోనికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. రెండు నెలల అనంతరం కార్యాలయ భవనంలోకి అ డుగుపెట్టిన పది రోజుల్లోనే రెండుసార్లు పాములు కనిపించడంతో సిబ్బందిలో తీవ్రభయాందోళన నెలకొంది. భవనం చుట్టూ చెరువు నీరు ఉండటంతో పాములు సు నాయాసంగా వస్తున్నాయని పలువురు పేర్కొంటున్నారు. నిత్యం మహిళ లు, సిబ్బందితో రద్దీగా ఉండే ఈ భవనంలోకి పాములు చేరుతుండటంతో ఆందోళనకర వాతావరణం నెలకొంది. పాములను చూసి మహిళలు మరింతగా భయభ్రాంతులకు గురవుతున్నారు. పాముల బెడద నుంచి తప్పించుకోవడానికి భవనంలోని మొదటి అంతస్థు నుంచి సిబ్బంది త మ కార్యకలాపాలను సాగించాలని నిర్ణయించడం కొసమెరుపు. ఈ సమస్యను ఏపీఎం హరినాయక్‌ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. 



Updated Date - 2021-11-14T06:12:28+05:30 IST