Advertisement
Advertisement
Abn logo
Advertisement

గాయత్రీమాత గర్భాలయంలో పాము


ఆత్మకూరు, డిసెంబరు 4: ఆత్మకూరు మండలం కరివేన గ్రామంలోని గాయత్రీమాత గర్భాలయంలో నాగుపాము దర్శనమిచ్చింది. శనివారం ఉదయం 10.30గంటల సమయంలో ఆలయ తలుపులు తెరిచి ఉండగా సమీపంలోని ముళ్లపొదల్లో నుంచి పాము ఆలయంలోకి ప్రవేశించింది. గర్భాలయంలోకి వెళ్లి గాయత్రీ అమ్మవారి మూలవిరాట్‌పై సంచరించింది. పురోహితులు కోటయ్యశర్మ పరిశీలించి గ్రామస్థులకు సమాచారం అందించారు. దాదాపు 8 అడుగుల పొడవుల నాగసర్పం అమ్మవారిని స్పృశించి వెళ్లడం గ్రామస్థులను ఆశ్చర్యానికి గురిచేసింది.  

Advertisement
Advertisement