Viral Video.. లుంగీ విప్పి పరుగో పరుగు.. పాము తోకను పట్టుకుని ఆటాడుకోబోయాడు.. సడన్‌గా..

ABN , First Publish Date - 2021-08-03T18:12:26+05:30 IST

పాము తోక పట్టుకుని ఆటాడుకోబోయిన వ్యక్తికి ఆ పాము చుక్కలు చూపించింది..

Viral Video.. లుంగీ విప్పి పరుగో పరుగు.. పాము తోకను పట్టుకుని ఆటాడుకోబోయాడు.. సడన్‌గా..

పాము తోక పట్టుకుని ఆటాడుకోబోయిన వ్యక్తికి ఆ పాము చుక్కలు చూపించింది.. దీంతో ఆ వ్యక్తి కట్టుకున్న లుంగీని విప్పేసి పరుగులు పెట్టాడు.. ఈ ఘటనను అతని స్నేహితులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఒక వ్యక్తి పాము తోక పట్టుకుని తల మీద కొట్టేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ పాము ఎగిరి ఆ వ్యక్తి లుంగీని నోటితో పట్టుకుంది. సదరు వ్యక్తి విడిపించుకునేందుకు ప్రయత్నించినా ఆ పాము పట్టు విడవలేదు. దీంతో సదరు వ్యక్తి ఆ లుంగీని విప్పేసి అక్కణ్నుంచి పారిపోయాడు. ఈ వీడియో చూసిన వారికి నవ్వులు పంచుతోంది. 



Updated Date - 2021-08-03T18:12:26+05:30 IST