Abn logo
May 25 2020 @ 21:15PM

వలస కార్మికులకు ‘స్నేహ హస్తాలు’

హైదరాబాద్: లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికులకు ‘స్నేహ హస్తాలు’ అనే స్వచ్ఛంద సంస్థ ఆపన్న హస్తం అందించింది. వలస కార్మికులకు వీలైనంతలో నిత్యవసర వస్తువులను సమకూర్చేందుకు 50 వేల రూపాయలను అందించారు. ఆంధ్రజ్యోతితో పాటు వివిధ పత్రికల్లో ప్రచురితమైన చిత్రాలకు స్పందించిన ఆ సంస్థ.. వలస కార్మికులకు ఏదైనా సాయం చేయలనే సంకల్పంతో ఇంత మొత్తంలో ఆర్థిక సహాయాన్ని అందించింది.


‘‘దేశాన్ని నిర్మాణంలో ప్రధాన భాగమైన వలస కార్మికులు రహదారులపై రక్తమోడుతున్నారు. నిజానికి వీళ్లు నిజమైన సైనికులు. వీళ్లే మన దేశ ఆత్మ. వారికి అనుకోని ఆపద ఎదురైంది. అయితే వారికి మన నుంచి సరైన సహకారం అందడం లేదు. అందుకే మేము ‘స్టెప్ ఇన్ మై షూస్’ అనే కార్యక్రమం ద్వారా వారికి ఏదైనా చేయాలని అనుకున్నాం. దేశంలోని ఎన్‌హెచ్-44, ఎన్‌హెచ్-16 జాతీయ రహదారుల వెంటన ఉన్న వలస కార్మికులకు చెప్పులు, బూట్లు అందించే కార్యక్రమం కొనసాగుతోంది. ఓ జర్నిలిస్టు మిత్రుడితో (ఫొటోగ్రాఫర్) కలిసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. వలస కార్మికుల బాధను పంచుకుందాం. రేపటి మన భవిష్యత్‌ తరాలకు వాళ్లు ఎంత ముఖ్యమో తెలిసేలా చెప్పే ప్రయత్నం చేద్దాం’’ అని స్నేహ హస్తాలు స్వచ్ఛంద సంస్థ సభ్యులు పేర్కొన్నారు.

Advertisement
Advertisement
Advertisement