‘స్నో లెపర్డ్‌’ రిటా మృతి

ABN , First Publish Date - 2020-09-22T09:52:25+05:30 IST

నేపాల్‌కు చెందిన ప్రముఖ పర్వతారోహకుడు అంగ్‌ రిటా షెర్పా మృతి చెందాడు.

‘స్నో లెపర్డ్‌’ రిటా మృతి

ఖాట్మండు: నేపాల్‌కు చెందిన ప్రముఖ పర్వతారోహకుడు అంగ్‌ రిటా షెర్పా మృతి చెందాడు. 72 ఏళ్ల రిటా కాలేయ, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. సాహసికుడైన రిటాను ముద్దుగా ‘స్నో లెపర్డ్‌ (మంచు చిరుత)’ అని పిలుచుకుంటారు. 1983-96 మధ్య ఆక్సిజన్‌ సిలిండర్‌ అవసరం లేకుండా అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్‌ పర్వతాన్ని పదిసార్లు అధిరోహించిన అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 

Updated Date - 2020-09-22T09:52:25+05:30 IST