సదువులకు సవాళ్లెన్నో?

ABN , First Publish Date - 2021-01-18T05:41:25+05:30 IST

కరోనా మహమ్మారి కారణంగా సుమారు 10 నెలల పా టు విద్యాసంస్థలు మూసే ఉన్నాయి. అయితే, ఇటీవల కరో నా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టడం.. కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలలు, కళాశాలల పునఃప్రారంభానికి సన్నాహా లు చేస్తోంది.

సదువులకు సవాళ్లెన్నో?
తలుపులు విరిగిపోయిన నిజామాబాద్‌ నగరంలోని కోటగల్లి బాలికల ఉన్నత పాఠశాల

ఉమ్మడి జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల పునఃప్రారంభానికి అధికారుల సన్నాహాలు

ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 9, 10, ఇంటర్‌  విద్యార్థులకు తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు

పాఠశాలల్లో కనీస సౌకర్యాల కల్పనపై విద్యాశాఖ దృష్టి

కార్యాచరణను సిద్ధం చేసిన విద్యాశాఖ

సమస్యల వలయంలో ప్రభుత్వ పాఠశాలలు

కనీస సౌకర్యాలు లేని పాఠశాలలెన్నో 

సిలబస్‌పై రాని స్పష్టత

10 పరీక్షల షెడ్యూల్‌ ఎప్పుడో? 

అయోమయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు

కామారెడ్డి, జనవరి 17 (ఆంధ్రజ్యోతి), నిజామాబాద్‌ అర్బన్‌: కరోనా మహమ్మారి కారణంగా సుమారు 10 నెలల పా టు విద్యాసంస్థలు మూసే ఉన్నాయి. అయితే, ఇటీవల కరో నా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టడం.. కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలలు, కళాశాలల పునఃప్రారంభానికి సన్నాహా లు చేస్తోంది. 9వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు తరగతులు నిర్వహించేందుకు నిర్ణయించింది. దీంతో ఉమ్మ డి నిజామాబాద్‌ జిల్లా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చే స్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో ఆయా పాఠశాలలు, కళాశాలల్లో పనులపై కార్యాచరణ రూ పొందిస్తున్నారు. 

ఫిబ్రవరి 1 నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలో ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఈ మేరకు పాఠశా లల ప్రాంగణాలు, మరుగుదొడ్లు, మూత్రశాలల పరిశుభ్రత బాధ్యతను పల్లెల్లో పంచాయతీలకు, పట్టణాల్లో మున్సిపాలి టీలకు అప్పగిస్తూ ఇదివరకే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ బడుల్లో పారిశు ధ్యం, మౌలిక వసతులు కల్పించేందుకు పంచాయతీలు, మున్సిపాలిటీలకు లేఖలు రాయాలని ఆయా ప్రభుత్వ పాఠ శాలల ప్రధాన ఉపాధ్యాయులు, కేజీబీవీ స్పెషల్‌ ఆఫీసర్లు, మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌లను విద్యాశాఖ అధికారులు ఆ దేశించారు. లేఖ ప్రతిని పాఠశాలల కార్యాలయాల్లో భద్రప రచాలని సూచించారు. తరగతులు ప్రారంభమై, పిల్లలు వ చ్చేలోపు బడికి కావాల్సిన మౌలిక వసతులపై నివేదికలు త యారు చేసి డీఈవో కార్యాలయానికి మెయిల్‌ ద్వారా పంపి ంచాలని ఆదేశాలు జారీ చేశారు.

కార్యాచరణ ఇలా

పాఠశాలల్లో కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి ఏంఈ వోలకు పంపించాల్సి ఉంటుంది. వారు మండల ప్రణాళిక తయారు చేసి డీఈవోలకు మెయిల్‌ ద్వారా పంపిస్తారు. కా ర్యాచరణ ప్రణాళికలో 9 నుంచి 12 తరగతుల విద్యార్థుల వి వరాలు, తరగతి గదులు, ఇతర గదులు, వారండాలో తాగు నీరు, విద్యుత్‌ కనెక్షన్‌ వివరాలు, మూత్రశాలల సంఖ్య, మ రుగుదొడ్ల సంఖ్య, శానిటైజేషన్‌, మెడికల్‌ ప్లాన్‌ తదితర వివ రాలు తయారుచేసి డీఈవో కార్యాలయానికి పంపించాలి. 

ఉమ్మడి జిల్లాలో మొత్తం 799 వరకు పాఠశాలలు

నిజామాబాద్‌ జిల్లాలో 9, 10 తరగతుల పాఠశాలలు 620 ఉండగా దాదాపు 47,800 మంది విద్యార్థులు ఉన్నారు. అదేవిధంగా 95 ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కళాశాలల్లో 37,641 మంది విద్యార్థులు ఉన్నారు. కామారెడ్డి జిల్లాలో 179 పాఠశాలలు ఉండగా దాదాపు 20 వేలమంది వరకు విద్యార్థులు ఉన్నారు. అదేవిధంగా 45 వరకు ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. వాటిలో దాదాపు 25 వేల వరకు విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. 

సమస్యల వలయంలో ప్రభుత్వ పాఠశాలలు

ఫిబ్రవరి 1 నుంచి 9, 10వ తరగతి విద్యార్థులకు తరగతులు ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. ప్రభుత్వ పాఠశాలలు మాత్రం సమస్యలతో సతమతమవుతున్నాయి. దాదాపు 10 నెలలుగా పాఠశాలలు తెరుచుకోకపోవడంతో సమస్యలు తాండవం చేస్తున్నాయి. కనీస సౌకర్యాలు లేక విద్యార్థులకు సమస్యలతో స్వాగతం పలకనున్నాయి. 10 నెలలుగా పాఠశాలలను పట్టించుకునే వారే లేకపోవడంతో పాఠశాలల ప్రాంగణాలన్నీ చిట్టడవులను తలపిస్తున్నాయి. మరుగుదొడ్లు, మూత్రశాలలు వృథాగా పడి ఉన్నాయి. మిషన్‌ భగీరథ ద్వారా తాగునీటి వసతి కల్పించేందుకు కుళాయి కనెక్షన్‌లు ఇచ్చినప్పటికీ తాగునీటి సరఫరా అంతంత మాత్రంగానే ఉన్నట్టు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో విద్యార్థులకు నీటి వసతి తప్పకుండా కల్పించాల్సి ఉన్నా ఇప్పటి వరకు ఆ పరిస్థితి లేకపోవడంతో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కొన్ని పాఠశాలలు ఆకతాయిలకు అడ్డాలు కాగా.. అనేక పాఠశాలలకు ప్రహరీ లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయి. పిచ్చి మొక్కలు బాగా పెరిగిపోయి మైదానాలన్నీ గడ్డితో నిండిపోయాయి. వాటిని తొలగించే వారు లేక పాఠశాలలన్నీ కళ తప్పాయి. 

సిలబస్‌పై రాని స్పష్టత

9, 10వ తరగతుల ప్రారంభంపై ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఏయే సిలబస్‌ బోధించాలనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌ ద్వారా పాఠ్యాంశాలు బోధించినా.. అవి విద్యార్థులకు ఎంతవరకు అర్థమయ్యాయో తెలియాల్సి ఉంది. తరగతులు ప్రారంభం కాగానే మళ్లీ మొదటి నుంచి పాఠాలు బోధించాలా? లేక ఆన్‌లైన్‌ పాఠ్యాంశాలు మినహా మిగతావి బోధించాలా? అనే విషయంలో స్పష్టత లేదు. ఎంత సిలబస్‌ బోధించాలో ఆ విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. 

10 పరీక్షల షెడ్యూల్‌ ఎప్పుడో?

10వ తరగతి విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా పాఠ్యాంశాలు వింటున్నప్పటికీ పరీక్షల షెడ్యూల్‌పై ఇంకా స్పష్టత లేకపోవడంతో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. సి లబస్‌, పరీక్షల విషయంలో ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాం టి స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో విద్యార్థులు ఆందో ళన చెందుతున్నారు.

పారిశుధ్యం పరిస్థితి ఏంటో? 

కరోనా ఇంకా పూర్తిస్థాయిలో తగ్గనందున ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో పాఠశాలలు పరిశుభ్రంగా ఉండడం ఎం తో ముఖ్యమైన విషయం. విద్యార్థులను తల్లిదండ్రులు పా ఠశాలలకు పంపడానికి సంకోచిస్తున్న ప్రస్తుత సమయం లో పాఠశాలలు పరిశుభ్రంగా ఉంటేనే విద్యార్థులను పం పే పరిస్థితులు ఉన్నాయి. కానీ ప్రభుత్వ పాఠశాలలను శు భ్రం చేసేందుకు పారిశుధ్య కార్మికులు లేకపోవడంతో అవి సమస్యలకు నిలయంగా ఉన్నాయి. పాఠశాలల పరిసరాల ను స్థానిక పంచాయతీ కార్మికులు శుభ్రం చేయాలని ప్ర భుత్వం ఆదేశాలు ఇచ్చినా.. తరగతి గదులను మాత్రం ఊ డ్చే వారే కరువయ్యారు. తరగతి గదులను శుభ్రం చేయ డం, పాఠశాలల పరిసరాలను శుభ్రం చేయడం, టేబుళ్లు ఇతర వస్తువులను శుభ్రం చేయడం లాంటి విషయాలు ప్రతీరోజు జరగాల్సి ఉండడంతో ఇవన్నీ జరిగే పనేనా? అ ని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

 తల్లిదండ్రుల అంగీకారంతోనే

ప్రభుత్వం 9, 10 తరగతులతో పాటు, ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు మాత్రమే అనుమతి ఇచ్చింది. అయితే, వి ద్యార్థులు పాఠశాలలకు రావడానికి తల్లిదండ్రుల అంగీకా రం తప్పనిసరి చేసింది. విద్యార్థులు భౌతికదూరం పాటిం చేలా చూడడంతో పాటు పాఠశాలల్లో కనీస వసతులు క ల్పించేలా చర్యలకు ఆదేశించింది. పాఠశాలలకు హాజరైన విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించనున్నారు. వి ద్యార్థులు మాస్కులు ధరించేలా ప్రత్యేక చర్యలు తీసుకో నున్నారు. 1 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు ఆన్‌ లైన్‌ విద్య కొనసాగనుంది. 

Updated Date - 2021-01-18T05:41:25+05:30 IST