పథకాలు కలిసొచ్చేలా

ABN , First Publish Date - 2022-09-21T05:51:37+05:30 IST

ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతీ సంక్షేమ పథకంతో అధికార పార్టీకి ప్రయోజనం చేకూర్చేలా అనుకూల ప్రచారం నిర్వహించాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. ఓ వైపు మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక రానున్న నేపథ్యంలో అక్కడ టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓట్లు రాల్చడంతోపాటు రానున్న రోజుల్లో ఉమ్మడి నల్లగొం డ జిల్లాలోని 12 నియోజకవర్గాలను తమకు అనుకూలంగా మార్చుకునేలా ప్రభుత్వ పథకాలపై ప్రచారానికి గులాబీ పార్టీ ప్రణాళిక రూపొందించింది.

పథకాలు కలిసొచ్చేలా

అనుకూల ప్రచారమే లక్ష్యంగా అధికారపార్టీ ప్రణాళిక

26 నుంచి పెన్షన్‌ స్మార్ట్‌కార్డులు, బతుకమ్మ చీరల పంపిణీ


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి,నల్లగొండ):  ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతీ సంక్షేమ పథకంతో అధికార పార్టీకి ప్రయోజనం చేకూర్చేలా అనుకూల ప్రచారం నిర్వహించాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. ఓ వైపు మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక రానున్న నేపథ్యంలో అక్కడ టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓట్లు రాల్చడంతోపాటు రానున్న రోజుల్లో ఉమ్మడి నల్లగొం డ జిల్లాలోని 12 నియోజకవర్గాలను తమకు అనుకూలంగా మార్చుకునేలా ప్రభుత్వ పథకాలపై  ప్రచారానికి గులాబీ పార్టీ ప్రణాళిక రూపొందించింది. 


ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లేందుకు మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య ప్రజాప్రతినిధులు వ్యూహరచన చేశారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేస్తూ వాటివల్ల లబ్ధిని వివరించడంతోపాటు ప్రతిపక్షాలకు విమర్శించే అవకాశం లేకుండా చేయాల న్న ఆలోచనలో అధికార పార్టీ ఉంది. ఈ నేపథ్యంలో బతుకమ్మ పండుగ సందర్భంగా వచ్చిన చీరలు వచ్చినట్టు పంపిణీ చేయాలని ఉన్నతాధికారులు సూచించినా, నేతల ఆదేశంతో ఈ కార్యక్రమానికి బ్రేక్‌ పడింది.


9.50లక్షల మందికి బతుకమ్మ చీరలు

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసేలా బతుకమ్మ పండుగకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున చీరల పంపిణీకి సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టా రు. ఏటా బతుకమ్మ పండుగకు ముందు చీరల పంపిణీ ప్రారంభించి, బతుకమ్మ నిర్వహించే అన్ని రోజుల్లో మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాలకు ఎమ్మెల్యేలే వెళ్లి చీరలు పంపిణీ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈ ఏడాది కూడా చీరల పంపిణీ చేపట్టనున్నారు. అం దుకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాలకు 9.50లక్షల చీరలు చేరాయి. 18ఏళ్లు నిండిన యువతులకు, ప్రతీ మహిళకు తెల్లరేషన్‌కార్డు ఆధారంగా చీరల పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే చీ రలు గోదాంలకు చేరా యి. చీరల పంపిణీకి నోడల్‌ అధికారులుగా డీఆర్‌డీఏ అధికారులు వ్యవహరిస్తుండగా లబ్ధిదారుల ఎంపి క ప్రక్రియ మాత్రం జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారు లు చేపట్టారు. గోదాంల్లో చీరలు భద్రపరిచే బాధ్యతను చేనేత జౌళీశాఖకు ప్రభుత్వం అప్పగించింది. గోదాంల నుంచి గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లోని వార్డులకు చేరవేసే బాధ్యత డీఆర్‌డీఏ అధికారులదే. గతంలో బతుకమ్మ చీరలను 14 రకాల డిజైన్లతో తయారు చేయించి పంపిణీ చేయగా, ఈసారి అదనంగా మరో మూడు రకాల డిజైన్లు చేర్చగా, మొత్తం 17 రకాల డిజైన్ల చీరలను పంపిణీ చేయనున్నారు. వీటీని ఎమ్మెల్యేలతోపాటు సర్పంచ్‌లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పంపిణీ చేయనున్నారు. 


స్మార్ట్‌కార్డుల పంపిణీ సైతం

ఇటీవల ప్రభుత్వం 57 ఏళ్ల వయస్సు నిండిన వారికి కొత్త పెన్షన్లను మంజూరు చేయగా, దీనికి సంబంధిం చిన స్మార్ట్‌కార్డులను లబ్ధిదారులకు పంపిణీచేయనుంది. ఈ స్మార్ట్‌కార్డుపై కేసీఆర్‌ బొమ్మతో పాటు రాష్ట్ర చిహ్నం తో గులాబీ రంగులో కార్డును రూపొందించారు. బతుకమ్మ చీరలతో పాటు పెన్షన్‌ స్మార్ట్‌కార్డులను ఈ నెల 26 నుంచి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి జిల్లాలో 4.80లక్షల మందికి స్మార్ట్‌కార్డులు పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వ పథకం ఏదైనా అట్టహాసంగా కార్యక్రమం నిర్వహించి ప్రజలకు పంపిణీ చేయడంతోపాటు, రానున్న సాధారణ ఎన్నికల నాటికి ప్రజల్లో ఈ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. ఈ ప్రచారంలో ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులందరినీ భాగస్వామ్యులను చేసి గులాబీ పార్టీ అనుకూలంగా మార్చుకోనుంది.


రాజకీయ లబ్ధి కోసమే

మునుగోడు ఉప ఎన్నికతో పాటు వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అధికార పార్టీ రాజకీయ లబ్ధిలో భాగంగా ప్రభుత్వ పథకాలను వాడుకుంటోందన్న చర్చ రాజకీయవర్గాల్లో ఉంది. సీఎం కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తే పథకాలు ప్రచారాస్త్రంగా కలిసివస్తాయని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. తాజాగా ఆసరా పెన్షన్ల స్మార్ట్‌కార్డులతో పాటు బతుకమ్మ చీరల పంపిణీని ప్రచారానికి వినియోగించుకుంటూనే ఇప్పటికే అమలులో ఉన్న రైతుబీమా, రైతుబంధు, దళితబంధు, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ను సైతం అనుకూలంగా మలుచుకోవాలనే యోచనలో ఎమ్మెల్యేలు ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనల మేరకే ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తూ ప్రతీ అంశాన్ని రాజకీయాలతో ముడిపెట్టాలని అధికార పార్టీ యోచిస్తోంది.



చీరల పంపిణీకి అన్ని ఏర్పాట్లు : ద్వారక్‌, చేనేత జౌళిశాఖ సహాయ సంచాలకుడు

ఉమ్మడి జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నల్లగొండ జిల్లాకు ఇప్పటికే 2.40లక్షలకు పై గా చీరలు చేరాయి. మిగతా చీరలు ఒకటి, రెం డు రోజుల్లో రానున్నాయి. వచ్చిన చీరలన్నింటి నీ గుర్తించిన ఏడు పాయింట్లలో, వ్యవసాయ మార్కెట్‌ యార్డుల్లో నిల్వ ఉంచాం. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే చీరల పంపిణీ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభిస్తాం.


Updated Date - 2022-09-21T05:51:37+05:30 IST