అలా పింఛన తీసేశారు

ABN , First Publish Date - 2021-10-07T05:12:21+05:30 IST

పెద్దకడుబూరు కురుబ వీధిలో ఈ అవ్వ పేరు ఆకుల లింగమ్మ. వయసు సుమారు 87 సంవత్సరాలు. తన 60వ ఏట భర్త మరణించాడు.

అలా పింఛన తీసేశారు


పెద్దకడుబూరు కురుబ వీధిలో ఈ అవ్వ పేరు ఆకుల లింగమ్మ. వయసు సుమారు 87 సంవత్సరాలు. తన 60వ ఏట భర్త మరణించాడు. వీరికి సంతానం లేదు. నా అన్నవాళ్లు లేరు. శరీరం సహకరించి నన్నాళ్లూ కూలి పనులు చేసుకుని బతికింది లింగమ్మ. ఆ తరువాత ఇరుగు పొరుగువారు, స్థానిక ప్రభుత్వ పాఠశాల వద్ద విద్యార్థులు పెట్టే ఆహారంతో కడుపు నింపుకునేది. ప్రభుత్వం ద్వారా వచ్చే పింఛను ఆసరగా ఉండేది. ఇప్పుడు లింగమ్మ లేవలేని స్థితిలో ఉంది. ఇదే సమయంలో పింఛన ‘ఏరివేత’ కోసం ప్రభుత్వం రేషన కార్డు నిబంధన పెట్టింది. ముందు నుంచీ తనకు రేషన కార్డు లేదు. దీంతో పింఛన ఆగిపోయింది. రెండు నెలల నుంచి పింఛన ఇవ్వకపోవడంతో ఎవరిని అడగాలో తెలియక  అవస్థలు పడుతోంది. పింఛను డబ్బులతో ఒక పూట ఏదో ఒకటి తినే వీలు ఉండేదని, అది కూడా నిలిచిపోవడంతో వృద్ధురాలి పరిస్థితి దయనీయంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధురాలి పరిస్థితి తమకు తెలుసని, కానీ ప్రభుత్వ నిబంధనలను పాటించక తప్పదని వీఆర్వో తిప్పన్న అన్నారు. త్వరలో రేషన కార్డు మంజూరు చేసి, పింఛనను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

- పెద్దకడుబూరు 


Updated Date - 2021-10-07T05:12:21+05:30 IST