కర్ఫ్యూ ఉల్లంఘన.. 3 నెలల గృహ నిర్బంధం

ABN , First Publish Date - 2020-04-06T09:36:28+05:30 IST

కర్ఫ్యూ ఉల్లంఘించిన సెర్బియా సాకర్‌ ప్లేయర్‌ అలెగ్జాండర్‌ ప్రిజోవిక్‌కు ఆ దేశ ప్రభుత్వం మూడు నెలలు పాటు గృహ నిర్బంధంలో ఉండాలని ఆదేశించింది...

కర్ఫ్యూ ఉల్లంఘన.. 3 నెలల గృహ నిర్బంధం

బెల్‌గ్రేడ్‌: కర్ఫ్యూ ఉల్లంఘించిన సెర్బియా సాకర్‌ ప్లేయర్‌ అలెగ్జాండర్‌ ప్రిజోవిక్‌కు ఆ దేశ ప్రభుత్వం మూడు నెలలు పాటు గృహ నిర్బంధంలో ఉండాలని ఆదేశించింది. ఈ  29 ఏళ్ల ఫుట్‌బాలర్‌ కర్ఫ్యూను పాటించకుండా స్నేహితులతో కలిసి బెల్‌గ్రేడ్‌లోని ఓ బార్‌లో వేడుక చేసుకుంటుండగా స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. ప్రిజోవిక్‌ ప్రస్తుతం సౌది అరేబియాకు చెందిన అల్‌ ఇతిహాద్‌ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

Updated Date - 2020-04-06T09:36:28+05:30 IST