social distance విషయంలో గొడవ.. ఫిర్యాదు చేయడానికి స్టేషన్‌కు వెళ్తే...

ABN , First Publish Date - 2021-07-18T18:46:25+05:30 IST

కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించాలని సూచించింనందుకు...

social distance విషయంలో గొడవ.. ఫిర్యాదు చేయడానికి స్టేషన్‌కు వెళ్తే...

  • భౌతిక దూరం పాటించమంటే దాడి 
  • ఫిర్యాదు చేసేందుకు పోలీ‌స్‌స్టేషన్‌కు..
  • పోలీసుల దురుసు ప్రవర్తన

హైదరాబాద్ సిటీ/వనస్థలిపురం : కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించాలని సూచించింనందుకు ఓ రెస్టారెంట్‌ యజమానితో పాటు సిబ్బంది తనపై దాడి చేశారని బాధితుడు వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేసేందుకు పోలీ‌స్‌స్టేషన్‌కు వెళ్తే పోలీసులు దురుసుగా ప్రవర్తించారని బాధితుడితో పాటు కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. హస్తినాపురంలోని ఇంద్రప్రస్థ కాలనీకి చెందిన గడ్డం శ్రీధర్‌రెడ్డి శుక్రవారం వనస్థలిపురం, సచివాలయనగర్‌ కాలనీలోని అతిధి రెస్టారెంట్‌లో భోజనం చేశాడు.


బిల్‌ చెల్లిస్తుండగా వెయిటర్‌ సమీపంలో నిల్చోవడంతో శ్రీధర్‌రెడ్డి అతడిని దూరంగా ఉండాలని సూచించాడు. దీంతో వెయిటర్‌తో పాటు రెస్టారెంట్‌ నిర్వాకులు శ్రీధర్‌రెడ్డిపై దాడికి పాల్పడ్డారు. బాధితుడు శ్రీధర్‌రెడ్డి వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ చర్యలు తీసుకోకపోగా, రెస్టారెంట్‌ యజమానికి మద్దతు పలికి తనపై దురుసుగా ప్రవర్తించి ఫిర్యాదు కాపీని చింపేశాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఉన్నతాధికారులు తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-07-18T18:46:25+05:30 IST