ఇప్పుడు అసలు ‘మర్యాద’ ఇదే.. భూమిపూజలో ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు..

ABN , First Publish Date - 2020-08-06T00:15:23+05:30 IST

అయోధ్య రామాలయం శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు...

ఇప్పుడు అసలు ‘మర్యాద’ ఇదే.. భూమిపూజలో ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు..

అయోధ్య: అయోధ్య రామాలయం శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మర్యాద అనే పదానికి మారుపేరు శ్రీరామచంద్రుడేనని అభివర్ణించిన ఆయన... ప్రస్తుతం కొవిడ్-19 కారణంగా దీని ప్రాముఖ్యత మరింత పెరిగిందన్నారు. సామాజిక దూరం పాటించడం, మాస్కులు ధరించడమే ఇప్పుడు అసలైన మర్యాద అని వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మర్యాద అంటే ‘‘దో గజ్ కీ దూరీ, మాస్క్ హై జరూరీ’’ (రెండు గజాల దూరం, మాస్క్ ధరించడం) అనీ.. దీన్ని తప్పకుండా పాటించాలని ప్రధాని అభ్యర్థించారు. ‘‘శ్రీరాముని ఆలయం రాబోయే తరాలకు ఎనలేని స్ఫూర్తిని, మార్గనిర్దేశనాన్ని అందిస్తుంది. మర్యాద అనే పదానికి మారుపేరు శ్రీరాముడు. ఇప్పుడు కొవిడ్-19 పరిస్థితుల్లో మర్యాద అనేది మరింత అవసరంగా మారింది...’’ అని ప్రధాని పేర్కొన్నారు. ప్రజలందరికీ సుఖ, సంతోషాలు లభించాలని భగవంతుడిని వేడుకుంటున్నానని ఆయన అన్నారు. ‘‘శ్రీరాముడు, సీతమ్మ తల్లి ఆశీర్వాలు ప్రజలందరికీ ఎల్లవేళలా లభించాలి...’’ అని ప్రధాని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. 

Updated Date - 2020-08-06T00:15:23+05:30 IST