Advertisement
Advertisement
Abn logo
Advertisement

పాత కరెన్సీ నాణేలు, నోట్లు తీసుకుంటామంటూ వచ్చి రూ.11 లక్షల టోపీ.. అది ఎలాగంటే..

66 ఏళ్ల ఓ వృద్ధురాలికి పాత కరెన్సీ నోట్లు, నాణేలు తీసుకుని వాటిని మార్చి ఇస్తామంటూ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ₹11.45 లక్షల మోసం చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.


పోలీసుల కథనం ప్రకారం కొందరు వ్యక్తులు పాత కరెన్సీ నోట్లు, నాణేలు తీసుకొని వాటికి బదులుగా కొత్తవి ఇస్తామంటూ ఓ వృద్ధురాలికి సోషల్ మీడియా ద్వారా సంప్రదించారు. వారు రూ.45 లక్షల విలువ చేసే  రూ. 5, రూ. 10 పాత నాణేలు, కరెన్సీ నోట్లను మార్చి ఇస్తామంటూ పలుమార్లు ఆమె సంప్రదించారు, వారు అలా మార్చి ఇచ్చినందుకు కమీషన్, జీఎస్‌టీ అవుతుందని, అది ముందస్తు చెల్లించాలని చెప్పారు. అందుకు రూ.11.45 లక్షలు వారి బ్యాంక్ అకౌంట్లో వేయాలని అడిగారు. దీంతో ఆమె వారి బ్యాంక్ అకౌంట్లో రూ.11.45 లక్షలు డిపాజిట్  చేసింది.


కానీ ఆ తరువాత వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో తాను మోసపోయనంటూ ఆమె భావించి పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు ఆమె ఫిర్యాదు మేరకు ఆ సైబర్ మోసగాళ్లను వెతికే పనిలో పడ్డారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement