అనుబంధాలపై సోషల్‌ మీడియా తీరిది!

ABN , First Publish Date - 2021-03-24T07:56:03+05:30 IST

ఈరోజుల్లో సామాజిక మాధ్యమాలు దాదాపు అందరి జీవితం, ఉద్యోగం, అనుబంధాల్లో భాగమైపోయాయి. సోషల్‌ మీడియా పరిచయంతో జీవితభాగస్వామిని వెతుక్కున్న వారున్నారు.

అనుబంధాలపై సోషల్‌ మీడియా తీరిది!

ఈరోజుల్లో సామాజిక మాధ్యమాలు దాదాపు అందరి జీవితం, ఉద్యోగం, అనుబంధాల్లో భాగమైపోయాయి. సోషల్‌ మీడియా పరిచయంతో జీవితభాగస్వామిని వెతుక్కున్న వారున్నారు. అదే మీడియా సాక్షిగా విడిపోయిన జంటలూ ఉన్నాయి. ప్రేమ పక్షుల మధ్య చిన్న చిన్న తగవులకు చాలా వరకు సామాజిక మాధ్యమాలు కూడా ఒక కారణం. అనుబంధాలపై సోషల్‌ మీడియా చూపే ప్రతికూల ప్రభావాలేంటో చూద్దాం... 


పెరిగే దూరం: నచ్చిన టీవీ షో గురించి భాగస్వామితో చెబుతూ నవ్వుకోవడం కన్నా సోషల్‌ మీడియా ఖాతాల్లో మునిగిపోవడం మీదే దృష్టి పెడతారు. మీరు ఫోన్‌ చూస్తూ ఎక్కువ సమయం గడుపుతున్నారంటే మీరు జంటగా తుళ్లుతూ సంతోషంగా ఉండే సమయాన్ని కోల్పోతున్నారని అర్థం. ఫలితంగా ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది.


ఆత్మగౌరవ సమస్య: భాగస్వామి ఎంత చక్కగా మెలిగినా కూడా కొందరు తమకు తగిన గౌరవం దక్కడం లేదనుకుంటారు. అన్యోన్యంగా ఉన్న జంటలను సోషల్‌ మీడియాలో చూసి, మీ అనుబంధాన్ని అంచనా వేసుకోవడం మొదలెడతారు. దాంతో మీ ప్రయాణంలో సంతోషం ఆవిరవుతుంది. 


అసూయకు ఆజ్యం: చాలా విషయాల్లో గొడవలకు కారణం అసూయనే. సోషల్‌ మీడియాను ఎక్కువగా ఉపయోగించేవారిలో ఈ సమస్య మరీ ఎక్కువ. ఆన్‌లైన్‌ ఫ్రెండ్స్‌, వారితో చాటింగ్‌ చూసి తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని భావిస్తారు. 


నమ్మకం పోతుంది: మీ పాత భాగస్వామితో చేసే చిన్న చాట్‌ కూడా మీ మధ్య నమ్మకాన్ని ప్రశ్నలా మారుస్తుంది. ఎందకుంటే సోషల్‌ మీడియాలో చీటింగ్‌  చేసుకునే వారు ఎక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి కూడా.


Updated Date - 2021-03-24T07:56:03+05:30 IST