Abn logo
Apr 4 2020 @ 00:26AM

సోషల్‌ మీడియాలో అతి చేస్తే వేటు: ఎస్‌బీఐ

కోల్‌కతా : సోషల్‌ మీడియాలో ఉద్యోగులు ఎవరైనా అతి చేస్తే వారిపై చర్యలు తప్పవని ఎస్‌బీఐ హెచ్చరించింది. ఈ మేరకు ఆయా సర్కిళ్లలోని బ్యాంకు చీఫ్‌ జనరల్‌ మేనేజర్లు (సీజీఎం) అందరికీ లేఖలు అందాయి. ఇటీవల కొందరు ఉద్యోగులు సోషల్‌ మీడియాలో బ్యాంకు విధానాలు, మేనేజ్‌మెంట్‌, శాఖల పనితీరుపై విమర్శలు పోస్టు చేస్తుండడంతో ఎస్‌బీఐ ఈ చర్య తీసుకుంది.

Advertisement
Advertisement
Advertisement