అతను ఓ సోషల్ వర్కర్.. లాక్‌డౌన్‌లో ఆమెకు రేషన్ పంపిణీ చేశాడు.. భర్తను వదిలేసి ఆమె అతని వెంటపడింది.. చివరికి..

ABN , First Publish Date - 2021-12-07T17:14:29+05:30 IST

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఇద్దరు పిల్లల తల్లికి..

అతను ఓ సోషల్ వర్కర్.. లాక్‌డౌన్‌లో ఆమెకు రేషన్ పంపిణీ చేశాడు..  భర్తను వదిలేసి ఆమె అతని వెంటపడింది.. చివరికి..

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఇద్దరు పిల్లల తల్లికి లాక్‌డౌన్ సమయంలో ఒక సోషల్ వర్కర్‌తో పరిచయం అయ్యింది. అది ప్రేమగా పరిణమించింది. ఆ సోషల్ వర్కర్ మాయలో పడిన ఆమె భర్తకు విడాకులు ఇచ్చింది. ఇద్దరు పిల్లలను కూడా భర్త దగ్గరే వదిలేసి, ఆ సోషల్ వర్కర్‌తో పాటు ఉండసాగింది. అయితే కొంతకాలం తరువాత ఆ సోషల్ వర్కర్ ఆమెను మోసగించాడు. పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. దీంతో ఆమె ఆ సోషల్ వర్కర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై ఆ సోషల్ వర్కర్ పలుమార్లు అత్యాచారం జరిపాడని ఆమె తన ఫిర్యాదులో ఆరోపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. 




జహాంగీరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇద్దరు పిల్లల తల్లి అయిన 25 ఏళ్ల మహిళ జహాంగీరాబాద్‌లో ఒక అద్దె ఇంట్లో ఉంటోంది. ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని వివరాల ప్రకారం లాక్‌డౌన్ సమయంలో ఆమెకు ఇక్బాల్(25) అనే యువకునితో పరిచయం ఏర్పడింది. లాక్‌డౌన్ సమయంలో అతను పేదలకు రేషన్ పంపిణీ చేశాడు. ఇక్బాల్‌కు ఆమె పరిచయం అయిన నేపధ్యంలో ఇద్దరూ ఫోను నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆ తరువాత నుంచి ఇక్బాల్ ఆమెకు తరచూ రేషన్ ఇవ్వడం ప్రారంభించాడు. దీంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. అప్పటికే ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. దీంతో ఇక్బాల్.. ఆమెతో.. ‘భర్తకు విడాకులు ఇచ్చి తన దగ్గరకు వచ్చేస్తే పెళ్లి చేసుకుంటానని’ అన్నాడు. దీంతో ఆమె ఇక్బాల్ కోరినట్లే చేసింది. అప్పటి నుంచి అతను ఆమెతో శారీరక సంబంధం ఏర్పరుచుకున్నాడు. అయితే ఆమె.. పెళ్లి చేసుకోవాలని ఎన్నిసార్లు కోరినా నిరాకరిస్తూ వచ్చాడు. దీంతో ఆమె ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Updated Date - 2021-12-07T17:14:29+05:30 IST