కరోనా నేపథ్యంలో వధువుకు వినూత్న హల్దీ వేడుక

ABN , First Publish Date - 2020-09-30T13:31:05+05:30 IST

కరోనా వైరస్ మహమ్మారి సామాజిక దూరాన్ని ఒక జీవన విధానంగా మార్చివేసిందనడానికి ప్రత్యక్ష సాక్ష్యంగా వధువు హల్దీ వేడుక వీడియో నిలిచింది....

కరోనా నేపథ్యంలో వధువుకు వినూత్న హల్దీ వేడుక

సోషల్ మీడియాలో వీడియో వైరల్

న్యూఢిల్లీ : కరోనా వైరస్ మహమ్మారి సామాజిక దూరాన్ని ఒక జీవన విధానంగా మార్చివేసిందనడానికి ప్రత్యక్ష సాక్ష్యంగా వధువు హల్దీ వేడుక వీడియో నిలిచింది. వివాహానికి ముందు వధువు హల్దీ వేడుక నిర్వహించడం సంప్రదాయం. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్థుత తరుణంలో కుటుంబసభ్యులు, అతిథులు వధువుకు మధ్య సామాజిక దూరం పాటిస్తూ పసుపును పెయింట్ రోలర్ల సాయంతో దూరం నుంచి పూశారు. ఓ మహిళ పొడవైన హ్యాండిల్ తో కూడిన పెయింటు రోలరు ఉపయోగించి పసుపు పేస్టును అతిథులు మాస్కులు ధరించి వధువుకు పూశారు.


 కరోనా వ్యాప్తి నేపథ్యంలో సామాజిక దూరం పాటిస్తూ వధువు హల్దీ వినూత్న వేడుక వీడియోను హర్జిందర్ కుక్రేజా ట్విట్టరులో షేర్ చేయడంతో అదికాస్తా వైరల్ అయింది. సామాజిక దూరంతో వినూత్న హల్దీ వేడుక వీడియోకు సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు అభినందిస్తూ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2020-09-30T13:31:05+05:30 IST