సొసైటీ మాజీ అధ్యక్షుడిపై దాడి

ABN , First Publish Date - 2022-01-17T04:41:46+05:30 IST

ఎర్రగొండపాలెం లో ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో హైవేలో బైకుపై వెళ్తున్న వ్యక్తి మీద దాడి జరిగింది.

సొసైటీ మాజీ అధ్యక్షుడిపై దాడి
గాయాలతో ఓబుల్‌రెడ్డి


షేక్‌ అబ్బాస్‌, అతని తండ్రిపై కేసు
ఎర్రగొండపాలెం, జనవరి 16 : ఎర్రగొండపాలెం లో ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో హైవేలో బైకుపై వెళ్తున్న వ్యక్తి మీద దాడి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సొసైటీ మాజీ అధ్యక్షుడు, వైసీపీ నాయకుడు కొప్పర్తి ఓబులరెడ్డి ఆదివారం బైకుపై వెళ్తుండగా ఎర్రగొండపాలెం చెందిన షేక్‌ అబ్బాస్‌ మరో ముగ్గురు వెంబడించారు. తమ తండ్రిపై ఎందుకు దాడి చేయించావని అబ్బాస్‌ తదితరులు ప్రశ్నించారు. ఓబులరెడ్డి ఆ మాటలు లక్ష్య పెట్టకుండా బైకుపై వెళుతున్నప్పటికీ అబ్బాస్‌ మరో ముగ్గురు అడ్డగించి కొట్టారు. ఈ దాడిలో అబ్బాస్‌, అతడి తండ్రి జిలానీ ఉన్నట్లు బాధితుడు ఓబులరెడ్డి ఎస్‌ఐ పి.సురే్‌షకు ఫిర్యాదు చేశారు. గాయపడిన ఓబులరెడ్డిని చికిత్స కోసం వైద్యశాలకు తరలించారు. ముంజేతిపై, పొట్ట కింద భాగంలో గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. 

తహసీల్దార్‌ ఆఫీస్‌ వద్ద జరిగిన దాడే కారణం!
ఎర్రగొండపాలెం రెవెన్యూ గ్రామ పరిధిలో షేక్‌ జిలానీ, చేకూరి ఆంజనేయులు భూమిని కొనుగోలు చేశారు. ఈ వివాదంలో విచారణ నిమిత్తం 2021 డిసెంబరు 20న తహసీల్దార్‌ ఆదేశాల మేరకు వై.కొత్తపల్లికి చెం దిన  ఒక వర్గం వారు 10 మహిళలు, మరో 8 మంది వ్యక్తులు వైపాలెంలోని మరో వర్గానికి చెందిన షేక్‌ జిలానీ, చేకూరి ఆంజనేయులు తహసీల్దారు ఆఫీస్‌ వద్దకు విచారణ నిమిత్తం హాజరు కాగా వారిపై మహిళలు దాడి చేశారు. ఈ దాడిలో సొసైటీ మాజీ అధ్యక్షుడు కొప్పర్తి ఓబులరెడ్డి ప్రమేయం ఉందన్న కక్షతో జిలానీ కొడుకు షేక్‌ అబ్బాస్‌, మరో ముగ్గురు ఆదివారం అతనిపై దాడి చేశారని పలువురు చర్చించుకుంటున్నారు. ఓ బులరెడ్డిపై జరిగిన దాడి నేపథ్యంలో ప్రధాన సెంటర్‌లో పికెట్‌ను ఏర్పా టు చేశారు. సీఐ దేవప్రభాకర్‌ పర్యవేక్షణలో త్రిపురాంతకం, పుల్లలచెరువు ఎస్‌ఐలు ప్రధాన సెంటర్‌లో పహారా కాస్తున్నారు.

Updated Date - 2022-01-17T04:41:46+05:30 IST