Abn logo
Jun 4 2020 @ 20:19PM

ప్రభాస్ దేవుడా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్ తర్వాత షూటింగ్స్‌కు అనుమతి రాగానే ఈ చిత్రానికి సంబంధించి మిగిలివున్న షూటింగ్‌ను త్వరగా పూర్తి చేసేందుకు పక్కా ప్రణాళికను తయారు చేస్తున్నారు. ఇప్పటికే విదేశాల్లో చేయాల్సిన షూటింగ్‌కు సంబంధించి హైదరాబాద్‌లోనే సెట్స్ వేసేందుకు సిద్ధం అవుతున్నట్లుగా సమాచారం. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ చేయబోయే చిత్రం కూడా కన్ఫర్మ్ అయింది. ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ చిత్రం ఉండబోతోంది. రాధాకృష్ణతో చేస్తున్న సినిమా సంగతులేమో కానీ, నాగ్ అశ్విన్‌తో చేయబోతోన్న సినిమాకి సంబంధించి మాత్రం రోజుకో వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. తాజాగా ఈ చిత్రంలో ప్రభాస్ దేవుడిగా కనిపించబోతున్నాడంటూ ఓ వార్త పుట్టుకొచ్చింది.


ఈ సినిమా నార్మల్‌గా సాగుతూనే మధ్యలో సోషియో ఫాంటసీ టచ్ ఉండబోతోందట. దేవుడికి, సైన్స్‌కి మధ్యలో జరిగే కాన్‌ఫ్లిక్ట్‌గా ఈ మూవీ ఉండనుందని, ప్రభాస్ దేవుడిలా కనిపిస్తాడని బాగా వినిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే చిరు ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’లా ఈ మూవీ ఉంటుందని అంటున్నారు. ఇది నిజమో కాదో తెలియదు కానీ.. ఈ న్యూస్ విన్న తర్వాత ప్రభాస్ అభిమానుల ఆనందానికైతే అవధులే లేవంటే నమ్మాలి మరి. 

Advertisement
Advertisement
Advertisement