‘హీరో బైక్‌’కు సాఫ్ట్‌ హంగులు

ABN , First Publish Date - 2021-07-24T05:30:00+05:30 IST

సరికొత్త సాఫ్ట్‌వేర్‌ హంగులతో మోటార్‌ సైకిల్‌ను హీరో మోటార్‌ కార్పొరేషన్‌ తీసుకువస్తోంది. ‘గ్లామర్‌ ఎక్స్‌టెక్‌’ పేరుతో దీన్ని విడుదల చేయనుంది.

‘హీరో బైక్‌’కు సాఫ్ట్‌ హంగులు

బ్లూటూత్‌, నేవిగేషన్‌, యూఎస్‌బీ ఛార్జింగ్‌ పోర్ట్‌ సరికొత్త సాఫ్ట్‌వేర్‌ హంగులతో మోటార్‌ సైకిల్‌ను హీరో మోటార్‌ కార్పొరేషన్‌ తీసుకువస్తోంది. ‘గ్లామర్‌ ఎక్స్‌టెక్‌’ పేరుతో దీన్ని  విడుదల చేయనుంది. ఇన్‌ బిల్ట్‌ టర్న్‌ బై టర్న్‌ నేవిగేషన్‌, బ్లూటూత్‌ కనెక్టివిటీ, యూఎస్‌బీ ఛార్జింగ్‌ పోర్ట్‌కు తోడు మరి కొన్ని అదనపు ఫీచర్లు దీన్లో ఉన్నాయి. ఇంజన్‌ కటాఫ్‌ స్విచ్‌, బ్యాంక్‌ యాంగిల్‌ సెన్సర్‌, లెడ్‌ హెడ్‌లైట్‌ వంటివి ఉన్నాయి. ఇలాంటి హంగులతో తాము తీసుకువస్తున్న మొదటి వెహికల్‌ ఇదేనని కంపెనీ పేర్కొంది. డెడికేటెడ్‌ యాప్‌ నుంచి అలర్ట్‌ మెసేజ్‌లు పొందవచ్చు. ‘గ్లామర్‌’ ఇటీవలి మోడల్స్‌లో మాదిరిగానే ఇందులోనూ 125సీసీ ఇంజిన్‌ ఉంటుంది. పెట్రోల్‌ వినియోగంలో ఆదాకు ఉద్దేశించిన పీజీఎంఎఫ్‌ఐ ఇంజన్‌ ఇది.  ఇది రెండు రకాల్లో లభ్యం కానుంది. డ్రమ్‌ బ్రేక్‌ మోడల్‌ రూ.78.900 కాగా, డిస్క్‌ వేరియంట్‌ రూ.83,500. 

Updated Date - 2021-07-24T05:30:00+05:30 IST