Abn logo
Mar 3 2021 @ 04:45AM

సాఫ్ట్‌వేర్‌ కష్టాలు...

శ్రీరాం, భావనా చౌదరి, ఆర్యమాన్‌, మహబూబ్‌ బాషా కీలక పాత్రధారులుగా సిల్వర్‌ పిక్సెల్‌ మీడియా సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘సాఫ్ట్‌ వేర్‌ బ్లూస్‌’.  ఉమా శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మార్చి మూడవ వారంలో  విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం అంటే అంతా సుఖమే అనుకుంటారు. అందులో ఉండే టాస్క్‌, టార్గెట్లు, కష్టాలు ఎలా ఉంటాయి అన్న నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కించాం. ప్రేమ, స్నేహం, జీవితం ఇందులో కీలకాంశాలు’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సుభాష్‌ ఆనంద్‌, సినిమాటోగ్రఫీ: నిమ్మ గోపి.

Advertisement
Advertisement
Advertisement