హ్యాకింగ్‌కు పాల్పడ్డ టెకీ.. పోయిన ఉద్యోగాన్ని తిరిగిపొందాలని..

ABN , First Publish Date - 2020-07-25T21:30:49+05:30 IST

పోయిన ఉద్యోగాన్ని తిరిగిపొందేందుకు కంపెనీని హ్యాక్ చేసిన టెకీని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హ్యాకింగ్‌కు పాల్పడ్డ టెకీ.. పోయిన ఉద్యోగాన్ని తిరిగిపొందాలని..

న్యూఢిల్లీ: పోయిన ఉద్యోగాన్ని తిరిగిపొందేందుకు కంపెనీని హ్యాక్ చేసిన టెకీని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..శాలరీ విషయంలో భేధాభిప్రాయం కారణంగా సదరు కంపెనీ ఇటీవల నిందితుడిని తొలగించింది. అయితే పోయిన ఉద్యోగం ఎలాగైనా సంపాదించుకోవాలని పట్టుదలకు పోయిన అతడు ఆ కంపెనీని హ్యాక్ చేశాడు. కొందరు కస్టమర్లకు సంబంధించిన కీలక సమాచారాన్ని తొలగించాడు. దీని వల్ల కంపెనీకి మళ్లీ తన అవసరం కలిగి పోయిన ఉద్యోగాన్ని తిరిగి పొందచ్చనుకున్నాడు. కానీ అతడి ప్లాన్ బెడిసికొట్టింది. సదరు కంపెనీ పోలీసులకు సమాచారం అందించడంతో వారు రంగంలోకి దిగి హ్యాకింగ్ మిస్టరీని ఛేధించారు. ఇందుకు కారణమైన టెకీని అరెస్టు చేశారు. 

Updated Date - 2020-07-25T21:30:49+05:30 IST