Jun 14 2021 @ 17:10PM

సినీ కార్మికులకు సొహైల్‌ సాయం

బిగ్‌బాస్ షో ద్వారా మంచి క్రేజ్ అందుకున్న సొహైల్.. ఇప్పుడు హీరోగానూ బిజీగా మారాడు. బిగ్‌బాస్‌ హౌస్‌లో యాంగ్రీ మ్యాన్‌గా ఆయన ఆడిన ఆటతీరుకు ప్రేక్షకులే కాదు.. హోస్ట్‌ నాగార్జున, ఫైనల్‌ ఎపిసోడ్‌ గెస్ట్‌ చిరంజీవి కూడా సొహైల్‌పై ప్రశంసలు కురిపించారు. ఇక బిగ్‌బాస్ హౌస్‌ నుంచి బయటకి వచ్చిన తరువాత సొహైల్ హెల్పింగ్ హ్యాండ్స్ అనే సంస్థ ద్వారా సొహైల్‌ ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ టాక్ అఫ్ ది టౌన్‌గా మారుతున్నాడు. తాజాగా ఆయన లాక్‌డౌన్‌లో ఇబ్బంది పడుతున్న సినీ కార్మికులకు తనవంతు సాయంగా నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. అంతేకాకుండా మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే విధంగా ప్రయత్నిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఇది తానొక్కడి శ్రమ మాత్రమే కాదని, కొంతమంది ఫ్యాన్స్ కలిసి సొహిలియన్స్‌గా ఫామై ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. ఈ సంస్థ ఇంత బాగా పనిచేయడానికి, ముందుకు వెళ్ళడానికి సొహిలియన్స్ ఎంతో కష్టపడుతున్నారని సొహైల్‌ తెలిపారు.