సింగరేణికి సౌరశక్తి

ABN , First Publish Date - 2021-04-09T09:11:12+05:30 IST

సౌరశక్తిలో సింగరేణి పరుగులు పెడుతోంది. రెండోదశలో 90 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్ల నిర్మాణం చేపట్టగా ఇందులో మందమర్రిలోని 15 మెగావాట్ల

సింగరేణికి సౌరశక్తి

హైదరాబాద్‌/కొత్తగూడెం, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): సౌరశక్తిలో సింగరేణి పరుగులు పెడుతోంది. రెండోదశలో 90 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్ల నిర్మాణం చేపట్టగా ఇందులో మందమర్రిలోని 15 మెగావాట్ల ప్లాంటును గురువారం గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. సింగరేణి మూడు దశల్లో 300 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్ల నిర్మాణం చేపట్టింది. తొలిదశలో 109 మెగావాట్ల సోలార్‌ విద్యుత్తును గ్రిడ్‌కు అనుసంధానం చేసేశారు.


రెండో దశలో మిగిలిన 85 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణాలను మే నెలాఖరుకు, మూడో దశలోని 81 మెగావాట్ల ప్లాంట్లను అక్టోబరు కల్లా పూర్తిచేయాలని సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ అధికారులను ఆదేశించారు. రెండో దశ ప్లాంట్ల నిర్మాణ పనులన్నీ ఆదానీ గ్రూపు దక్కించుకుంది. ఇక మూడో దశలో నీటిపై తేలియాడే 15 మెగావాట్ల ప్లాంటు నిర్మాణాన్ని నోవస్‌ కంపెనీ చేపట్టింది. అందుబాటులోకి వచ్చే సోలార్‌ ప్లాంట్లలోని 300 మెగావాట్లు కలిపి 1500 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్న సంస్థగా సింగరేణి రికార్డుల్లోకి ఎక్కనుంది. 

Updated Date - 2021-04-09T09:11:12+05:30 IST