Abn logo
Sep 25 2021 @ 22:48PM

దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయకు ఘన నివాళి

ఆసిఫాబాద్‌లో మొక్కలు నాటుతున్న బీజేపీ నాయకులు

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 25: జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాల యంలో పండిత్‌  దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించు కుని బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు జేబీ పౌడెల్‌, నాయకులు ఆత్మారాం, సతీష్‌బాబు, మురళీధర్‌, విశాల్‌, శ్రావణ్‌గౌడ్‌, గణేష్‌, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
పెంచికలపేట మండలంలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ నియోజ కవర్గ నాయకుడు కొత్తపల్లి శ్రీనివాస్‌ పండిత్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యా య చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనం తరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో నాయకులు లహన్‌రాజ్‌, కృష్ణస్వామి, అంజన్న, ఆశన్న,  రాజన్న, శ్రీనివాస్‌, పోచన్న, మల్లేష్‌, అంజన్న, మహేష్‌ పాల్గొన్నారు.
చింతలమానేపల్లి: మండల కేంద్రంలో బీజేపీ నాయుకులు  పండిత్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో బీజేపీ నాయుకలు శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు.
దహెగాం: మండల కేంద్రంలో బీజేపీ నాయకులు పార్టీ జెండాను ఆవిష్కరించి పండిత్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ చిత్రపటానికి  పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నాయకులు సురేష్‌, జ్ఞానేశ్వర్‌, నగేష్‌, శ్రీహరి, మల్లేష్‌, కిషన్‌, ఈశ్వర్‌, ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.