Abn logo
Sep 27 2021 @ 23:57PM

కోట్లకు ఘన నివాళి

నివాళి అర్పిస్తున్న కోట్ల జయసూర్యప్రకాశ్‌ రెడ్డి, టీడీపీ నాయకులు

కర్నూలు(అగ్రికల్చర్‌), సెప్టెంబరు 27: దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి 20వ వర్ధంతిని పురస్కరించుకుని టీడీపీ నాయకులు ఆయనకు ఘన నివాళి అర్పించారు. రెండుసార్లు ముఖ్యమంత్రిగా సేవలు అందించి, కేంద్రంలో ఎన్నో పదవులు చేపట్టిన కోట్ల విజయభాస్కరరెడ్డి మచ్చలేని నేత అని కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి కొనియాడారు. సోమవారం ఆయనతో పాటు కర్నూలు, నంద్యాల లోక్‌సభ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గౌరు వెంకటరెడ్డి కిసాన్‌ ఘాట్‌కు వెళ్లి కోట్ల విజయభాస్కరెడ్డి సమాధికి పూలమాలలు వేశారు. టీడీపీ నాయకులు మాట్లాడుతూ కోట్ల ఏనాడూ వివాదాల జోలికి వెళ్లలేదని, నిజాయితీకి మారుపేరుగా నిలిచారని కొనియాడారు. కార్యక్రమంలో పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత తదితరులు పాల్గొన్నారు.