బదిలీపై వెళుతున్న సబ్‌కలెక్టర్‌కు ఘన సత్కారం

ABN , First Publish Date - 2022-01-27T05:08:39+05:30 IST

రాజంపేట నుంచి అనంతపురం జేసీగా బదిలీపై వెళుతున్న రాజంపేట సబ్‌కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌కు బుధవారం వీడ్కోలు పలుకుతూ ప్రజాప్రతినిధులు, రెవెన్యూ డివిజన్‌అధికారులు ఘనంగా సత్కరించారు.

బదిలీపై వెళుతున్న సబ్‌కలెక్టర్‌కు ఘన సత్కారం
సబ్‌కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ను సన్మానిస్తున్న జెడ్పీ చైర్మన్‌ ఆకేపాటి, ప్రభుత్వ విప్‌ కొరముట్ల తదితరులు

రాజంపేట, జనవరి 26: రాజంపేట నుంచి అనంతపురం జేసీగా బదిలీపై వెళుతున్న రాజంపేట సబ్‌కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌కు బుధవారం వీడ్కోలు పలుకుతూ ప్రజాప్రతినిధులు,  రెవెన్యూ డివిజన్‌అధికారులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కేతన్‌గార్గ్‌ చేసిన సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. ఆయన వచ్చిన అనతికాలంలోనే పేదల పక్షాన నిలిచి అనేక కార్యక్రమాలు నిర్వహించారన్నారు. భూ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపి తమ తడాఖా చూపించారన్నారు.  కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాధరెడ్డి, ప్రభుత్వ విప్‌, రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, బద్వేల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ రాజగోపాల్‌రెడ్డి, రాజంపేట రోటరీక్లబ్‌ అధ్యక్షుడు గురుప్రతా్‌పరెడ్డి, రాజంపేట మున్సిపల్‌ కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-01-27T05:08:39+05:30 IST