8ఏ గని ప్రమాద మృతులకు ఘన నివాళులు

ABN , First Publish Date - 2021-10-18T05:39:57+05:30 IST

8ఏ ప్రమాదం జరిగిఆదివారానికి 18 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఆదివారం గని సమీపంలో స్మారకస్థూపం వద్ద మృతుల సంస్మరణ సభ జరిగింది.

8ఏ గని ప్రమాద మృతులకు ఘన నివాళులు
స్తూపం వద్ద మృతులకు నివాళులు అర్పిస్తున్న నాయకులు

యైుటింక్లయిన్‌కాలనీ, అక్టోబరు 17: 8ఏ ప్రమాదం జరిగిఆదివారానికి 18 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఆదివారం గని సమీపంలో స్మారకస్థూపం వద్ద మృతుల సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా వివిధ కార్మిక సంఘాల నా యకులు స్థూపానికి పూలమాలలు వేసి మరణించిన కార్మికులకు నివాళులు అ ర్పించారు. ఈసందర్భంగా పలవురు నాయకులు మాట్లాడారు. యాజమాన్యం రక్షణ చర్యలు తీసు కోవడంలో విఫలమైన కారణంగానే 2003 అక్టోబర్‌ 16 అర్ధ రాత్రి గనిపై కప్పు కూలి 10మంది కార్మికులు మృత్యువాతపడ్డారని, వారిని యా జమాన్యమే బలితీసుకున్నదని పేర్కొన్నారు. ప్రమాదాలు సంస్థలకు మాయని మచ్చలా మిగిలిపోతాయని, ఆధునిక సాంకేతిక అందుబాటులోకి వచ్చిన ప్రస్తు త తరుణంలో కూడా ప్రమాదాలు జరగు తుండడం బాధాకరమైన విషయమ న్నారు. ఉత్పత్తితో పాటు రక్షణ చర్యలపై సింగరేణి యాజమాన్యం పూర్తిస్థాయి లో దృష్టి సారించాలని నాయకులు సూచి ంచారు. ఈసంస్మరణ సభలో టీబీజీకేఎస్‌, ఏఐటీయూసీ, బీఎంఎస్‌, ఐఎన్‌టీయూసీ, సీఐటీయూ నాయకులు కెంగర్ల మల్లయ్య, యాదగిరి సత్తయ్య, అయిలి శ్రీనివాస్‌, సారంగపాణి, సత్యనారాయణ రెడ్డి, ప్రకాష్‌, రాజారత్నం, ఉల్లి మొగిలి, మార్కండేయ, శంకర్‌నాయక్‌, దశరథం గౌడ్‌, బేతి చంద్రయ్య, పీఓ మోహన్‌రెడ్డి, మేనేజర్‌ రమేష్‌లతో పాటు మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులు, పలువురు కార్మికులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-18T05:39:57+05:30 IST