గడ్డెన్నకు ఘన నివాళులు
ABN , First Publish Date - 2021-04-21T06:24:42+05:30 IST
స్వర్గీయ మాజీ మంత్రి వర్యులు గడ్డెన్న కాక వర్ధంతిని ముథోల్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు, అభిమానులు మంగళవారం ఘనంగా నిర్వహించారు.
భైంసా, ఏప్రిల్ 20 : స్వర్గీయ మాజీ మంత్రి వర్యులు గడ్డెన్న కాక వర్ధంతిని ముథోల్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు, అభిమానులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకోని భైంసా మండలంలోని దేగాం గ్రామంలో గల గడ్డెన్న కాకా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించిన నాయకులు మాట్లాడుతూ ముథోల్ నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి గడ్డెన్న కాకా అనిర్వచనీయమైన సేవలను అందించారని కొనియడారు.