Abn logo
Sep 21 2021 @ 23:55PM

కొండా లక్ష్మణ్‌బాపూజీకి ఘన నివాళులు

కొండా లక్ష్మణ్‌ బాపూజీ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న నాయకులు

నేరడిగొండ, సెప్టెంబరు 21: మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కొండా లక్ష్మణ్‌ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుడు, క్విట్‌ ఇండియా ఉద్యమం, గైర్‌ ముల్కి ఆందోళన, తెలంగాణ ఉద్యమ కారుడు స్వరాష్ట్రం కోసం పరితపించిన తెలంగాణవాది కొండా లక్ష్మణ్‌ బాపూజీ  అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ పెంటవెంకట రమణ, ఆడెపు రమేష్‌, కామని ప్రభాకర్‌, శేఖర్‌, సత్య నారాయణ, రాజేశ్వర్‌, సాగర్‌ పెంటరాము  తదితరులు పాల్గొన్నారు.

బోథ్‌: కొండా లక్ష్మణ్‌ బాపూజీ నేటి సమాజానికి ఆదర్శ ప్రాయుడని, ఆయన ప్రత్యేక తెలంగాణ కోసం తనమంత్రి పదవిని త్యాగం చేసిన మహనీయుడని బోథ్‌ మండల పద్మశాలీ సంఘం అధ్యక్షుడు మెరుగు భోజన్న పేర్కొన్నారు. మంగళవారం బోథ్‌లోని మార్కండేయ ఆలయంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ 9వ వర్ధంతి సభను పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో స్వార్థంతో ప్రజలు, రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్నారని బాపూజీ నమ్మిన సిద్ధాంతాలను కట్టుబడి ఉన్నారన్నారు. ఇందుతలో సంఘం గౌరవ అధ్యక్షుడు గంగుల మల్లేష్‌, సంఘ సభ్యులు పాల్గొన్నారు.

ఉట్నూర్‌రూరల్‌: మండలంలో మంగళవారం కొండా లక్ష్మణ్‌ బాపూజీ వర్ధంతిని టీఆర్‌ఎస్‌ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కందుకూరి రమేష్‌ ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాపూజీ సేవలను కొనియాడారు. ఇందులో అజిమొద్దీన్‌, దాసండ్ల ప్రభాకర్‌, సెడ్మాకి సీతారాం, కాలేరి రవి, లతీఫ్‌, అన్సారీ, భీంరావు, తిరుపతి, సత్తన్న పాల్గొన్నారు.