Advertisement
Advertisement
Abn logo
Advertisement

విరామంలోనూ పాదయాత్రకు సంఘీభావం

నెల్లూరు: ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని అంటూ అమరావతి రైతులు చేస్తున్న మహాపాదయాత్రకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పలువురు సంఘీభావం తెలుపుతూ నెల్లూరుకు తరలివస్తున్నారు. ఆదివారం ఎడతెరపి లేని వర్షంలో నెల్లూరులోని కొత్తూరు వద్ద గల శాలివాహన కల్యాణ మండపంలో విశ్రాంతి తీసుకుంటున్న మహాపాదయాత్ర రైతులను కలుసుకునేందుకు వస్తున్న ఇతర జిల్లాలవారితో ఆ ప్రాంతం తిరుణాళ్ల సందడి నెలకొంది. వర్షం కారణంగా ఆదివారం పాదయాత్రకు రైతులు విరామం పలికారు. ఈ సందర్భంగా న్యాయ స్థానం టూ దేవస్థానం యాత్ర విజయవంతం కావాలని, అమరావతి రాష్ట్ర రాజధాని కావాలనే సంకల్పంతో మహిళా రైతులు గాయత్రి హోమం నిర్వహించారు. విశాఖ స్టీలు ప్లాంట్‌ ఉద్యోగులు మహాపాదయాత్రలో పాల్గొనాలని నెల్లూరుకు వచ్చి రైతులకు  సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పాదయాత్ర రూ.2.65లక్షల విరాళం అందజేశారు. మహాపాదయాత్ర పూర్తి అయిన తర్వాత విశాఖ వరకు పాదయాత్ర జరపాలని కోరారు. 

Advertisement
Advertisement