కన్నీటి సాలిడారిటీ

ABN , First Publish Date - 2020-04-06T09:18:40+05:30 IST

ఈ రాత్రి నిదుర లేచింది నా కల నిదుర పోయింది పువ్వులతో రాలిపోయి చిరు నవ్వులతో చెదిరిపోయి రహదారి తొలిగి పోయింది...

కన్నీటి సాలిడారిటీ

ఈ రాత్రి నిదుర లేచింది  

నా కల నిదుర పోయింది 


పువ్వులతో రాలిపోయి 

చిరు నవ్వులతో చెదిరిపోయి

రహదారి తొలిగి పోయింది


కొండలతో కూలిపోయి 

పసి కూనలకై కుమిలిపోయి 

గుండె గాలి నిలిచి పోయింది    


కనిపించని బుల్లి రవ్వ 

కరోనా నరమేధమయ్యే 

కనిపెంచిన భూగోళం

చావు బతుకుల దేహమయ్యే   


మాట లేని పాట ఒకటి 

కొత్త మనిషి పుష్పించే 

తోట నొకటి చూపించి   


ఈ రాత్రి నిదుర పోయింది 

నా కల నిదుర లేచింది

లెల్లె సురేష్‌


Updated Date - 2020-04-06T09:18:40+05:30 IST