ఘనంగా ఉగాది

ABN , First Publish Date - 2021-04-14T04:58:34+05:30 IST

నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల్లో ఉగాది పర్వదిన వేడుకలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు.

ఘనంగా ఉగాది
తిమ్మాజిపేటలో పంచాంగ శ్రవణానికి హాజరైన గ్రామస్థులు

అచ్చంపేట/ అచ్చంపేట అర్బన్‌ ఏప్రిల్‌ 13: నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల్లో ఉగాది పర్వదిన వేడుకలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. అచ్చంపేట మండలంలోని ఆలయాల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఉమామహేశ్వర క్షేత్రంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని కన్యాకాపరమేశ్వరి ఆలయం, భ్రమరాంబికా ఆలయం తోపాటు భక్త మార్కండేయ, పల్కపల్లి రామాలింగేశ్వర ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం వేళలో ప్రముఖ ఆలయాల్లో వేద పండితులు పంచాంగ శ్రవాణాన్ని వినిపించారు. భ్రమరాంబికాలయంలో ఉదయభాస్కర్‌, వెంకటశాస్త్రి కానకాపరమేశ్వరి ఆలయంలో శ్రీనివాస శర్మ పంచాంగం వినిపించారు.


భక్తి శ్రద్ధలతో పూజలు 

తిమ్మాజిపేట: తిమ్మాజిపేటతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో ఉగాది పర్వదిన వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం ఉగాది రోజున ఉదయమే భక్తులు నూతన వస్ర్తాలు ధరించి తమ గ్రామాలలోని ఆలయాలకు వచ్చి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఉగాది పచ్చడి, పిండి వంటలు చేసుకొని కుటుంబ సభ్యులతో గడిపారు. సాయంత్రం దేవాలయాల్లో పూజారులు ప్లవనామ సంవత్సర రాశి ఫలాలను చెప్పడం, గ్రామాలలో ఏర్పాటు చేసిన మైకుల ద్వారా ప్రజలు విన్నారు. ఈ ఏడాది వర్ష్షాలు సమృద్ధిగా కురుస్తాయని తెలియడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.


కొత్త బట్టలు ధరించి..

ఉప్పునుంతల: మండల కేంద్రమైన ఉప్పునుంతలతో పాటు మండల పరిధిలోని గ్రామాల్లో మంగళవారం  ఉగాది పండగ ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు కొత్త బట్టలు ధరించి సమీపంలోని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంట్లో ఏర్పాటు చేసుకొన్న పిండి వంటలు కుటుంబ సభ్యులతో కలిసి ఆరగించి సందడి చేశారు. అనంతరం గ్రామంలో  పంచాంగం చెప్పించుకున్నారు. 


ఆలయాలకు పోటెత్తిన భక్తులు

తిమ్మాజిపేట: తిమ్మాజిపేటతోపాటు మండలంలోని పలు గ్రామాలలో  ఉగాది పర్వదిన వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. నూతన వస్ర్తాలు ధరించి తమ గ్రామాల్లోని ఆలయాలకు వచ్చి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఇళ్లకు చేరుకొని ఉగాది పచ్చడి, పిండి వంటలు చేసుకొని కుటుంబ సభ్యులతో గడిపారు. సాయంత్రం దేవాలయాల్లో పూజారులు ప్లవ నామ సంవత్సర రాశి ఫలాలను చెప్పారు.


ఇళ్లలోనే పండగ

చారకొండ: తెలుగు సంవత్సరాది అయిన ప్లవనామ ఉగాది పర్వదినాన్ని మండలంలో ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో మంగళవారం ఉగాది పండుగను చాలా వరకు ఇళ్ల లోనే జరుపుకున్నారు. ప్రజలు నూతన వస్త్రాలు ధరించి ఇళ్ల ముందు మామిడి తోరణాలు కట్టుకున్నారు. గ్రామాల్లోని దేవాలయాల్లో ప్రజలు భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు. మండల పరిధిలోని శిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రజలు స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం అర్చకులు పంచాగం చెప్పారు. 


గ్రామాల్లో వేడుకలు

ఊర్కొండ: మండల కేంద్రంతోపాటు పరిధిలోని ఇప్పపహడ్‌, జకినాలపల్లి, ఊర్కొండపేట, నర్సంపల్లి, గుండ్లగుంటపల్లి, బొమ్మరాజుపల్లి, జగబోయిన్‌పల్లి, రాంరెడ్డిపల్లి, ముచ్చర్లపల్లి, తిమ్మన్నపల్లి, రేవల్లి, గుడిగాని పల్లి, మాదారం, రాచాలపల్లి గ్రామాల్లో ప్లవనామ సంవత్సర ఉగాది సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లో అర్చకులు పంచాంగం చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో మండల ప్రజాప్రతినిధు లు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 


పంచాంగం చెప్పించిన పెద్దలు

కల్వకుర్తి అర్బన్‌, పెంట్లవెల్లి, కొల్లాపూర్‌ రూరల్‌: కల్వకుర్తి మండల పరిధిలోని జిల్లెల్ల, రఘుపతిపేట, మార్చాల, గూండూరు, తాండ్ర తదితర గ్రామాల్లో మంగళవారం ఉగాది పండుగ వేడుకలు ఘనంగా జరి గాయి. సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు ఎముక జంగయ్య, సర్పంచ్‌లు ఆవ మల్లయ్య, సుశీల తదితరులు గ్రామ ప్రజలకు వేద పండితులతో పంచాంగం చెప్పించారు. అలాగే పెంట్లవెల్లి మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. కొల్లాపూర్‌ మండల పరిధిలోని గ్రామాల్లో కూడా ఉగాది వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. 


దేవాలయాల్లో ప్రత్యేక పూజలు

వంగూరు: తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలు మంగళవారం మండల వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. తెల్లవారు జాము నుంచి ప్రజలు సాంప్రదాయ పద్ధతిలో నూతన వస్ర్తాలు ధరించి షడ్రుచులతో తయారు చేసిన ఉగాది పచ్చడిని స్వామివారికి నైవేద్యంగా సమర్చించారు. సాయంత్రం అర్చకులు పంచాంగం చూశారు. దేవాలయాలకు వెళ్లి ప్రజలు, స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రత్యేక పూజలు చేశారు. 


సంప్రదాయ బద్ధంగా ఉత్సవాలు

తెలకపల్లి: మండల కేంద్రం తెలకపల్లితోపాటు మండల పరిధిలోని పలు గ్రామాల్లో నూతన సంవత్సర ఉగాది ఉత్సవాలను సాంప్రదాయ బద్ధంగా ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలోని సరస్వతీ శిశుమందిరంలో ఉగాది ఉత్సవాల విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలకు ఉగాది పచ్చడి విశిష్టతను వివరించారు. ఆయా గ్రామాలలో తమ ఇళ్లకు మామిడి తోరణాలు కట్టుకున్నారు. 


శాస్త్రోక్తంగా ప్లవనామ సంవత్సరం పంచాంగం

కందనూలు: నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని రామాలయంలో, హౌసింగ్‌ బోర్డులోని వెంకటేశ్వర ఆల యంలో శాస్త్రోక్తంగా ప్లవనామ సంవత్సరం పంచాంగం మంగళవారం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని రామా లయంలో అర్చకులు వరదరాజన్‌ అయ్యాంగర్‌ పలు రాశులు వారికి అదాయ, వ్యయ వివరాలు తెలియజేశా రు. వివిధ రాశుల వారికి రాజపూజ్యం, అవమానం అదే విధంగా పాడి పంటలు, వర్షాలు, గాలులు, విచే విధా నాన్ని తెలియజేశారు. ప్రజలు దైవరాధన, ఆధ్యాత్మిక సేవలో ఉండాలని సూచించారు. అష్టమ, ఎలినాటి శని ఉన్న వారు హనుమాన్‌ పరమ శివునికి సందర్శించు కొని పూజలు చేయాలని సూచించారు. 


రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరుగుతుంది 

ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌ రెడ్డి 

కొల్లాపూర్‌ రూరల్‌: ప్లవనామ సంవత్సరాదిలో కరోనా కష్టాలు తొలగిపోయి రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరుగుతుందని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. బుధవారం కొల్లాపూర్‌ పట్టణంలోని పూరాణ క్షేత్ర రామాలయంలో జరిగిన పంచాంగం పఠనం కార్యక్రమంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. మొదట ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో జరిగిన పంచాంగం అత్యంత వైభవంగా జరిగింది. కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులతోపాటు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 


దేవాలయాలకు వెళ్లి పూజలు 

కోడేరు: మండల కేంద్రం కోడేరుతోపాటు మండలంలోని పలు గ్రామాలలో మంగళవారం ఉగాది వేడుకల ను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయమే భక్తులు ఆయా గ్రామాల్లోని దేవాలయాలకు వెళ్లి పూజలు నిర్వహించారు. మండలంలోని జనుంపల్లి, తీగలపల్లి, ఎత్తం, బావాయిపల్లి, నర్సాయిపల్లి, రాజాపూర్‌ గ్రామాలలో పంచాంగం ప్రజలకు వినిపించారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు, సర్పంచులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.


దేవునితిర్మలాపూర్‌ గ్రామంలో..

పెద్దకొత్తపల్లి: పెద్దకొత్తపల్లితో పాటు మండల పరిధిలోని దేవునితిర్మలాపూర్‌ గ్రామంలో మంగళవారం ఉగాది పర్వదిన వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. నూతన వస్ర్తాలు ధరించి దేవాలయాలకు వెళ్లి పూజలు నిర్వహించారు. పిండి వంటలతోపాటు ఉగాది పచ్చడి చేసుకున్నారు. ఆయా గ్రామాల్లోని దేవాలయాల ఆవరణలో పూజారులు పంచాంగం వినిపించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సూర్యపతాప్‌గౌడ్‌, జడ్పీటీసీ సభ్యురాలు మేకల గౌరమ్మ, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు ప్రజలు పాల్గొన్నారు.





Updated Date - 2021-04-14T04:58:34+05:30 IST