Abn logo
Sep 22 2021 @ 23:36PM

ఇళ్ల దరఖాస్తులకు 90 రోజుల్లో పరిష్కారం

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌, జేసీలు

  గృహ నిర్మాణాలపై కలెక్టర్లు దృష్టి సారించాలి

  వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి

కలెక్టరేట్‌, సెప్టెంబరు 22: ఇళ్ల స్థలలకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను 90 రోజుల్లో పరిష్కరించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించా రు. బుధవారం సాయంత్రం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా  సీఎం మాట్లాడుతూ..  ఇళ్ల స్థలాల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండకూడదన్నారు. లేఅవుట్ల వారీగా లబ్ధిదారు లు ఎంతమంది ఉన్నది సమాచారం తెలియజేయాలన్నారు. బేస్‌మెంట్‌ లోపల ఉన్న గృహా నిర్మాణాలపై కలెక్టర్లు దృష్టి సారించాలని చెప్పారు.  రీచ్‌ల నుంచి ఇసుక తీసుకునేందుకు లబ్ధిదారులు రవాణా చార్జీలు మాతమే చెల్లించాలన్నారు. కలెక్టర్లు, జేసీలు వారానికి ఒకసారి గృహ నిర్మాణాలు,  లేఅవుట్లపై మండలస్థాయిలో సమీక్షలు నిర్వహించాలని  సూచించారు. 1980 నుంచి 2011 వరకు మంజూరు చేసిన గృహా లకు రిజిస్ట్రేషన్‌ చేస్తే బ్యాంకులు రుణాలు ఇచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన డేటా సేకరణ ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలన్నారు. ఎంఐజీ గృహాలకు భూసేకరణ చేస్తే ప్రతిపాదనలు పంపా లన్నారు. అగ్రిగోల్డ్‌ భూ ములను గుర్తించి ఎంఐజీ ఇళ్ల  నిర్మాణాలకు వినియోగించాలన్నారు. రైతు భరోసా కేంద్రాల   నిర్మాణాలపై దృష్టి సారించాలని..  డిసెంబరు 31 నాటికి ఈ భవనాలను పూర్తిచేయాలని ఆదేశించారు. పంచాయతీల్లో మూడు నుంచి 5 సెంట్ల భూమి బల్క్‌ మిల్క్‌ యూనిట్లకు సరిపోతుందని.. ఈ నిర్మాణాలు కూడా డిసెంబరు ఆఖరు నాటికి పూర్తిచేయాలని సీఎం స్పష్టం చేశారు.

 కరోనాపై అప్రమత్తం..

కొవిడ్‌ మూడో దశ వస్తుందో.. రాదో అన్న విషయం పక్కపెట్టి అంతా అప్రమ త్తంగా ఉండాలని  ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆక్సిజన్‌కు కొరత లేకుండా చర్యలు తీసుకోవాల న్నారు. వ్యాక్సిన్‌ రెండు డోస్‌లు పక్కాగా వేయాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌, జేసీలు సుమిత్‌ కుమార్‌, కె.శ్రీనివాసులు, హిమాంశు కౌశిక్‌, తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి: దిశ యాప్‌పై  ఎస్పీలతో సీఎం వీడియోకాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. జిల్లాలో దిశ యాప్‌ ఆవశ్యకత, అవగాహన కోసం తీసుకుంటున్న చర్యలను ఎస్పీ అమిత్‌బర్దర్‌ వివరించారు.  ఎస్‌బీ డీఎస్పీ వీరకుమార్‌ పాల్గొన్నారు.