పెండింగ్‌ కేసులను సత్వరమే పరిష్కరించండి

ABN , First Publish Date - 2022-01-20T06:31:06+05:30 IST

నేరాల నియంత్రణతో పాటు పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలని రామగుండం సీపీ చంద్రశేఖర్‌రెడ్డి అధికారులకు సూచించారు.

పెండింగ్‌ కేసులను సత్వరమే పరిష్కరించండి
సమావేశంలో మాట్లాడుతున్న సీపీ చంద్రశేఖర్‌రెడ్డి

- ఒమిక్రాన్‌ పట్ల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి... 

- సీపీ చంద్రశేఖర్‌రెడ్డి

కోల్‌సిటీ, జనవరి 19: నేరాల నియంత్రణతో పాటు పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలని రామగుండం సీపీ చంద్రశేఖర్‌రెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం పోలీస్‌ కమిషనరేట్‌ ఆవరణలో మంచిర్యాల జోన్‌ పోలీస్‌ అధికారులతో నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మంచిర్యాల జోన్‌లో వివిధ పోలీస్‌ స్టేషన్‌లలో ఉన్న పెండింగ్‌ కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసులను సత్వరమే పరిష్కరించడానికి కృషి చేయాలని, ప్రతి కేసులోనూ క్వాలిటీ ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ పెంపొందించుకోవాలని సూచించారు. ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో 5ఎస్‌ ఇంప్లీమెంటేషన్‌ చేయాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో విజుబుల్‌ పోలీసింగ్‌, బ్లూ కోల్ట్స్‌, పెట్రోకార్‌ నిరంతరంగా తిరిగేటట్టు చర్యలు తీసుకోవాలన్నారు. కేసుల విచారణలో ఎస్‌ఓపీని పాటించాలని, నేరస్థులకు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కేసుల వివరాలన్నీంటిని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిరంతరం నిఘా ఏర్పాటు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నేర నియంత్రణ చేయడానికి ఎంతో ఉపయోగపడే సీసీ కెమెరాలపై ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించాలని, సీసీ కెమెరాలు ఎక్కువ మొత్తంలో ఏర్పాటు చేయాలని సూచించారు. వివిధ సమస్యలతో పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే బాధితుల పట్ల మర్యదగా ప్రవరిస్తూ పోలీసులపై నమ్మకాన్ని పెంపొందించే విధంగా బాధ్యతగా పని చేయాలన్నారు. ప్రజలకు రోడ్డు ప్రమాదాలపై, ట్రాఫిక్‌ నియమాలపై అవగాహన కల్పించాలన్నారు. టౌన్‌లలో ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలను చేపట్టాలని సూచించారు. కరోనా ఒమిక్రాన్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో పోలీస్‌ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీస్‌ స్టేషన్‌లలో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ విధులు నిర్వహించాలన్నారు. ప్రజలందరూ కొవిడ్‌ నిబంధనలు పాటించేలా అవగాహన కల్పించాలన్నారు. నిబంధనలు పాటించని వారిపై విపత్తు నిర్వహణ చట్టం క్రితం జరిమానాలు, కేసులు నమోదు చేయాలని అధికారులకు సీపీ సూచించారు. ఈసమావేశంలో జైపూర్‌ ఏసీపీ నరేందర్‌, బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్‌, ట్రాఫిక్‌ ఏసీపీ బాలరా జు, ఏఆర్‌ ఏసీపీలు సుందర్‌రావు, మల్లికార్జున్‌, సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ కమలాకర్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ విద్యాసాగర్‌, ప్రసాద్‌రావు, సైబర్‌ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్లు ప్రతాప్‌నాగరాజుతో పాటు మంచిర్యాల జోన్‌లో సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-20T06:31:06+05:30 IST