విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-07-24T03:15:05+05:30 IST

పాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ సమీపంలో ధర్నా నిర్వహించారు.

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
గూడూరు: ధర్నా చేస్తున్న ఫ్యాప్టో నాయకులు

ఉపాధ్యాయ సంఘాల ధర్నా

గూడూరురూరల్‌, జూలై 23: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ సమీపంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో నాయకులు మాట్లా డుతూ పీఆర్‌సీ గడువు మూడేళ్లు గడుస్తున్నా ప్రభుత్వం కమిటీలతో కాలయాపన చేస్తోంద న్నారు. సీపీఎస్‌ను రద్దు చేస్తామన్న సీఎం జగన్మోహన్‌రెడ్డి ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏలను ఇప్పటి వరకు చెల్లించకుండా ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందన్నారు. 3, 4, 5 తరగతులను విభజించి ప్రాథమిక విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేలా ఉన్న సర్క్యులర్‌ 172ను ఉపసంహరించు కోవాలన్నారు. ఏపీజీఎల్‌ఐ పీఎఫ్‌ సేవింగ్స్‌ను రుణాల రూపంలో అందించకుండా ఈ మొత్తాలను సంక్షేమ పథకాలకు దొడ్డిదారిన మళ్లించడం మంచి పద్ధతికాదన్నారు. అనంతరం ఆర్డీవో మురళీకృష్ణ, తహసీల్దారు లీలారాణి అందజేశారు. కార్యక్రమంలో చిరంజీవి, ఎస్‌కే బాబు, మురళీసింగ్‌, నవకోటేశ్వరరావు, మల్లికార్జున, రపూఫ్‌, రవి, మనోజ్‌కుమార్‌, జైపాల్‌, కరీముల్లా, శివకుమార్‌, సుధీర్‌, బాలసుబ్రమణ్యం, సుబ్రమణ్యంరాజు తదితరులు పాల్గొన్నారు.

వెంకటగిరి:   తహసీల్దారు కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో ఫ్యాప్టో జిల్లా అధ్యక్షుడు తాళ్లూరు శ్రీనివాసులు మాట్లాడారు.  తహసీల్దారు ఆదిశేషయ్యకు వినతిపత్రం అంద జేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుమారస్వామి, రత్నయ్య, ఫణీంద్ర, బాలకృష్ణయ్య, ఉదయ భాస్కర్‌, రాధాకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.




Updated Date - 2021-07-24T03:15:05+05:30 IST