Advertisement
Advertisement
Abn logo
Advertisement

సమస్యలు పరిష్కరిస్తారా? రాజీనామా చేయమంటారా?

కౌన్సిలర్‌ దుర్గాభవాని

భువనగిరి టౌన్‌, డిసెంబరు 3:  పట్టణంలో కుక్కలు, పందులు, కోతు ల బెదద తీవ్రంగా ఉందని, ఈ సమస్యను మునిసిపల్‌ అధికారులు పరిష్కరిస్తారా? లేదంటే  తన పదవికి రాజీనామా చేయాలా? అని భువ నగిరి మునిసిపల్‌ 34వ వార్డు కౌన్సిలర్‌ కోళ్ల దుర్గాభవాని అధికారులను ప్రశ్నించారు. ఈ మూడు జంతువుల  విహారంతో వార్డులో  భయానక పరిస్థితులు ఏర్పడ్డాయని  అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లినా స్పందన కరువైందంటూ స్థానికులతో కలిసి పట్టణంలోని నిర్వహించిన నిరసన ర్యాలీ ఆమె పాల్గొని మాట్లాడారు. వార్డులో ఇంటి తలుపులు తెరవలేని దుస్థితి ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలను పరిష్కరించాలని ఆమె కోరారు. నిరసన ర్యాలీలో  వార్డు ప్రజలు అధిక సంఖ్యలో  పాల్గొన్నారు. 
Advertisement
Advertisement