వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించండి

ABN , First Publish Date - 2022-07-28T07:31:18+05:30 IST

ప్రభుత్వం వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు రామారావు పాటిల్‌ అన్నారు.

వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించండి
వీఆర్‌ఏ దీక్ష శిబిరంలో మాట్లాడుతున్న కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామరావుపటేల్‌

ముథోల్‌, జూలై 27 : ప్రభుత్వం వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు రామారావు పాటిల్‌ అన్నారు. బుధవారం మండల కేంద్రమైన ముథోల్‌లోని తహసీల్దార్‌ కార్యాలయం ఆవరణలో వీఆర్‌ఏలు చేపట్టిన సమ్మెకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాం డ్‌ చేశారు. వీఆర్‌ఏలకు పే- స్కేల్‌ జీవోను వెంటనే విడుదల చేయాలని పేర్కొన్నారు. 55 సంవత్సరాలు పైబడిన వారి వారసులకు ఉద్యోగ అవకా శాలు కల్పించాలన్నారు. వీఆర్‌ఏల సమ్మెకు కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఎజా జుద్దీన్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు టి. రమేష్‌, వీఆర్‌ఏల సంఘం అధ్యక్షుడు వరుగంటి రాము, ఉపాధ్యక్షుడు గంగాధర్‌, సాయినాథ్‌, సాయ న్న, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. 

కుభీర్‌ :  వీఆర్‌ఏల న్యాయమైన డిమాండ్‌లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు పవార్‌రామరావుపటేల్‌ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం ముం దు వీఆర్‌ఏలు నిర్వహిస్తున్న మూడవరోజు సమ్మెలో ఆయన పాల్గొని మద్ధతు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్య మంత్రి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రం లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడితే వీఆర్‌ఏల డిమాండ్‌లను వెంటనే పరిష్క రిస్తుందని అన్నారు. అనంతరం పలు డిమాండ్‌లతో కూడిన వినతి పత్రా న్ని తహసీల్దార్‌ విశ్వంబర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు వడ్నం నాగేశ్వర్‌, ప్యాట లక్ష్మణ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్నిల నాగేందర్‌, పార్టీ మండల మైనార్టీ కన్వీనర్‌ జావిద్‌ఖాన్‌, యువజన సంఘం నాయకులు కనకయ్య, నాయకులు చంద్రశేఖర్‌, సర్పం చ్‌ రాజేందర్‌, అశోక్‌, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. 

కుంటాల :  వీఆర్‌ఏలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చి వారి సమస్యలను పరిష్కరించాలని ఎంపీపీ, జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి ఆప్క గజ్జారాంయాదవ్‌ డిమాండ్‌ చేశారు. తమ న్యాయ పరమైన సమస్యల పరిష్కారానికి సమ్మె చేపడుఉతన్న వీఆర్‌లకు బుధవారం ఎంపీపీ ఆప్క గజ్జారాంయాదవ్‌ సంఘీభావం తెలిపారు. ఈయన వెంట కోఆప్షన్‌ సభ్యులు గౌస్‌, నాయకులు కేశవ్‌, రాధకృష్ణ, నవీన్‌లున్నారు.

Updated Date - 2022-07-28T07:31:18+05:30 IST