క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు పరిష్కరిస్తా

ABN , First Publish Date - 2021-07-30T05:50:48+05:30 IST

తూర్పు పరిధిలోని సమస్యల విషయమై క్షేత్రస్థాయిలో పర్యటించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని నగర కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌ తెలిపారు.

క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు పరిష్కరిస్తా
నగర కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌తో తూర్పు సమస్యలపై చర్చిస్తున్న దేవినేని అవినాష్‌

క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు పరిష్కరిస్తా 

నగర కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌ 

గుణదల, జూలై 29: తూర్పు పరిధిలోని సమస్యల విషయమై క్షేత్రస్థాయిలో పర్యటించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని నగర కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌ తెలిపారు. తూర్పులోని పలు సమస్యలు పరిష్కార విషయమై వినతిపత్రం సమర్పించేందుకు వైసీపీ తూర్పు ఇన్‌చార్జి దేవినేని అవినాష్‌, డిప్యూటీ మేయర్‌ బెల్లం దుర్గలు నగర కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌ను శుక్రవారం కలిశారు. సమస్యలు సానుకూలంగా విన్న ఆయన పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.  నగరాన్ని అభివృద్ధి బాటలో నిలపాలన్న జగన్మోహనరెడ్డి ఆకాంక్షను అన్ని ప్రభుత్వశాఖల అధికారుల సమన్వయంతో సాకారం చేయాలన్నదే నా లక్ష్యం అని దేవినేని తెలిపారు. దీనిలో భాగంగానే కమిషనర్‌ను కలిసినట్లు చెప్పారు. మాజీ డిప్యూటీ మేయర్‌ ముసునూరి సుబ్బారావు, కార్పొరేటర్లు భీమిశెట్టి ప్రవళ్లిక, రెహనా, కనకదుర్గా కాలనీ అధ్యక్షుడు నారాయణ, పాతూరి సాంబశివరావు పాల్గొన్నారు. 

ప్రజలకు అందుబాటులో ఉంటాం : దేవినేని అవినాష్‌

రాణిగారితోట: 16వ డివిజన్‌లో గురువారం పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ తూర్పు ఇన్‌చార్జి అవినాష్‌ మాట్లాడుతూ ప్రభుత్వానికి పేదలను ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదని, ఆ విధంగానే ఆస్తి పన్ను విధానం రూపకల్పన చేశారని, నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు. రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణంలో ఇళ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వమే ఉచితంగా ఇళ్లు ఇస్తుందని, ప్రతిపక్షాల మాటలు నమ్మి ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-30T05:50:48+05:30 IST