మరికొన్ని ప్రభుత్వ శాఖలు... మూసివేత దిశగా...

ABN , First Publish Date - 2021-03-05T00:02:29+05:30 IST

మరికొన్ని ప్రభుత్వ శాఖలు ‘మూసివేత’ దిశగా సాగుతున్నాయా ? కేంద్రప్రభుత్వ వర్గాల నుంచి ఇందుకుగాను ‘అవును’ అనే సమాధానమే వినవస్తోంది.

మరికొన్ని ప్రభుత్వ శాఖలు... మూసివేత దిశగా...

న్యూఢిల్లీ : మరికొన్ని ప్రభుత్వ శాఖలు ‘మూసివేత’ దిశగా సాగుతున్నాయా ? కేంద్రప్రభుత్వ వర్గాల నుంచి ఇందుకుగాను ‘అవును’ అనే సమాధానమే వినవస్తోంది.  వ్యాపారాలను సులభతరం చేయాలన్న ఉద్దేశంలో భాగంగా...  ‘స్వయం ప్రతిపత్తి’ కలిగిన కొన్ని సంస్థలు, శాఖలను క్రమంగా రద్దు చేయాలని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ముఖ్య సలహాదారు సంజీవ్‌ సన్యాల్‌ ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా... జ్యూట్‌ అడ్వైజరీ బోర్డ్‌, ఆల్‌ ఇండియా హ్యాండ్‌లూమ్‌ బోర్డ్‌లు ఇప్పటికే మూసివేసిన విషయం కూడా విదితమే.


ఇదిలా ఉంటే... రానున్న రోజుల్లో ఇలాంటి మరిన్ని శాఖలను కేంద్రం రద్దు చేయనుంది. ‘కనీస ప్రభుత్వం... గరిష్ట గవర్నెన్స్‌’ లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతోంది. దేశ వృద్ధి రేటులో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించే క్రమంలో నిబంధనలను సడలించడం, సులభతరం చేయడం దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. 



కేంద్ర ప్రభుత్వం 100 శాతం నిధులతో ‘న్యూ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ ఇన్స్‌ట్యూషన్‌(డిఎఫ్‌ఐ)’ని ఏర్పాటు చేయనుంది. ఇందులో... ప్రైవేటు వాటాదారుల(స్టేక్‌ హోల్డర్లు)కు భాగస్వామం కల్పించనుంది. ఈ సంస్థ ప్రైవేటురంగ పెట్టుబడిదారుల అవసరాలను తీర్చేదిశగా వ్యవహరిస్తుందని ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. తక్కువ పన్నులతో ఇక... 2021-22 లో దేశ జిడిపి 14.5 శాతం మేర పెరుగొచ్చని, ద్రవ్యోల్బణం 4.5 శాతానికి పరిమితం కావొచ్చని కేంద్రం అంచనా వేస్తోంది. మౌలిక వసతుల కల్పన రంగంపై దృష్టి సారించడం ద్వారా ఉపాధి కల్పన అవకాశాలు, వనరులను పెంచాలని కేంద్రం నిర్ణయించింది. 

Updated Date - 2021-03-05T00:02:29+05:30 IST