Advertisement
Advertisement
Abn logo
Advertisement

రూ.23కోట్ల బీమా డబ్బుల కోసం మాస్టర్ ప్లాన్ వేశాడు.. ప్రస్తుతం అతడి లైఫ్ ఎలా ఉందంటే..!

కష్టపడకుండా డబ్బు రావాలని చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. చాలా సందర్భాల్లో అవి బెడిసికొడుతుంటాయి. మరికొందరు తమ తెలివి తేటలతో నిజాయితీగా డబ్బు సంపాదిస్తుంటారు. ఐరోపా హంగేరీలో 54 ఏళ్ల సెందర్ అనే వ్యక్తి తన బీమా డబ్బుల కోసం మాస్టర్ ప్లాన్ వేశాడు. సుమారు రూ.23కోట్ల డబ్బులు మంజూరు చేయాలని పలు బీమా సంస్థలకు దరఖాస్తు చేసుకున్నాడు. ప్రస్తుతం అతడి జీవితం ఎలా ఉందంటే..

హంగేరీలో 2014లో జరిగిన ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సెందర్ అనే వ్యక్తికి కోట్ల డబ్బులు సంపాదించాలని ఆశ ఉండేది. అయితే ఆచరణలో మాత్రం సాధ్యమయ్యేది కాదు. రోజూ ఈ విషయం గురించే ఆలోచించేవాడు. అయితే చివరకు అతనికి ఓ ఐడియా వచ్చింది. బీమా పాలసీలు తీసుకుంటే.. కష్టపడకుండా డబ్బు వస్తుంది కదా అని అనుకున్నాడు. తర్వాత వివిధ బీమా సంస్థల నుంచి సుమారు 14 పాలసీలను తీసుకున్నాడు. మొత్తం రూ.23 కోట్ల 97 లక్షల డబ్బులు వచ్చేలా బీమా ప్లాన్ తీసుకున్నాడు. అయితే అంత మొత్తం రావాలంటే దానికి కాల పరిమితి ఉంటుంది. ఏళ్లు గడుస్తున్నా తన కోరిక మాత్రం తీరడం లేదు. దీంతో తనకు విసుగొచ్చింది. ఎలాగైనా బీమా డబ్బులు త్వరగా తీసుకోవాలని అనుకున్నాడు.

అనంతరం అతను పెద్ద మాస్లర్ ప్లానే వేశాడు. యాక్సిడెంట్ చేయించుకుంటే డబ్బులు వస్తాయనే ఆశతో వివిధ ప్రయత్నాలు చేశాడు. చివరగా రైల్వే ట్రాక్ పైకి వెళ్లి కాళ్లు పెట్టి పడుకున్నాడు. ట్రైన్ ఎక్కడంతో రెండు కాళ్లు తెగిపోయాయి. ప్రమాదవశాత్తు జారి ట్రాక్‌పై పడ్డానని, దీంతో తన రెండు కాళ్లు పోయాయని.. బీమా కంపెనీలకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఇతడిపై అనుమానం రావడంతో బీమా కంపెనీలు పెండింగ్‌లో పెట్టాయి. దీంతో తనకు న్యాయం చేయాలని కోర్టుకు వెళ్లాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన విచారణలో అసలు విషయం బయటపడింది. డబ్బుల కోసం కావాలనే ట్రైన్ కింద కాళ్లు పెట్టినట్లు చివరకు ఒప్పుకొన్నాడు. దీంతో కోర్టు కేసును కొట్టేసింది. అత్యాశతో తన రెండు కాళ్లనూ పొగొట్టుకున్న సెందర్.. ప్రస్తుతం కృత్రిమ అవయవాలతో కాలం వెళ్లదీస్తున్నాడు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement