ధరలు పెరుగుతున్నాయనే ఆందోళనతో రాత్రుళ్లు మేలుకునే ఉంటున్నాను : ఇమ్రాన్ ఖాన్

ABN , First Publish Date - 2022-01-24T01:48:03+05:30 IST

ధరల పెరుగుదల సమస్య ఒక్కొక్కసారి తనను రాత్రివేళల్లో నిద్రపోనివ్వడం

ధరలు పెరుగుతున్నాయనే ఆందోళనతో రాత్రుళ్లు మేలుకునే ఉంటున్నాను : ఇమ్రాన్ ఖాన్

ఇస్లామాబాద్ : ధరల పెరుగుదల సమస్య ఒక్కొక్కసారి తనను రాత్రివేళల్లో నిద్రపోనివ్వడం లేదని, అయితే ఇది కేవలం పాకిస్థాన్ సమస్య మాత్రమే కాదని ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ద్రవ్యోల్బణానికి రెండు దశలు ఉన్నాయన్నారు. తాము ప్రభుత్వంలోకి వచ్చినపుడు భారీ కరంట్ అకౌంట్ లోటును ఎదుర్కొనవలసి వచ్చిందని, దానివల్ల దిగుమతుల ధరలు విపరీతంగా పెరిగాయని చెప్పారు. ప్రస్తుత ద్రవ్యోల్బణం కరోనా వైరస్ మహమ్మారి వంటి అంతర్జాతీయ పరిస్థితుల ఫలితమని తెలిపారు. ‘‘ఆప్ కా వజీర్-ఏ-ఆజమ్, ఆప్ కే సాథ్’’ కార్యక్రమంలో ఆదివారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ మహమ్మారి వల్ల బ్రిటన్‌లో 30 ఏళ్ళ రికార్డు స్థాయి ద్రవ్యోల్బణం ఉందన్నారు. 


పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ గురించి మాట్లాడుతూ, నవాజ్ రాక కోసం తాను ఎదురు చూస్తున్నానని చెప్పారు. ఆయన లండన్ నుంచి నేడో, రేపో పాకిస్థాన్ వస్తారని చెప్తున్నారన్నారు. ఆయన తిరిగి రావాలని తాను ప్రార్థిస్తున్నానని చెప్పారు. అయితే ఆయన రాబోరని, ఎందుకంటే ఆయన డబ్బును ప్రేమిస్తారని, పాకిస్థాన్‌కు తిరిగొచ్చి దానిని పోగొట్టుకోవడానికి ఆయన ఇష్టపడరని అన్నారు. ఇలాంటివారి సమయం గడిచిపోయిందన్నారు. కొందరు అక్కడ పోలో ఆడుకుంటున్నారని, రోల్స్ రాయిస్ కార్లలో తిరుగుతున్నారని, రాజ వంశీకులు సైతం అంత సొమ్ము ఖర్చుపెట్టడం లేదని అన్నారు. అలాంటివారు తిరిగి పాకిస్థాన్‌కు ఎందుకు వస్తారని ప్రశ్నించారు. ఆయన 2017 నుంచి లండన్‌లో ఉంటున్నారని, తాము 2018లో అధికారం చేపట్టామని తెలిపారు. 


Updated Date - 2022-01-24T01:48:03+05:30 IST