ఇంకా మానని గాయం

ABN , First Publish Date - 2020-07-14T10:20:38+05:30 IST

యావత్‌ భారతదేశాన్ని కదలించింది సోంపేట థర్మల్‌ ఉద్యమం. నేల కోసం, భావితరాల భవిత కోసం రైతులు, మత్స్యకారుల పోరాట స్ఫూర్తి అజరా మరం.

ఇంకా మానని గాయం

థర్మల్‌ ఉద్యమానికి పదేళ్లు


(సోంపేట): యావత్‌ భారతదేశాన్ని కదలించింది సోంపేట థర్మల్‌ ఉద్యమం. నేల కోసం, భావితరాల భవిత కోసం రైతులు, మత్స్యకారుల పోరాట స్ఫూర్తి అజరా మరం. ఎన్‌సీసీ యాజమాన్యం, కొమ్ముకాసిన ప్రభు త్వానికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ముగ్గురు రైతులు అసువులు బాశారు. వీర మరణం పొందా రు. మహోద్యమానికి నెత్తుటి తిలకమై నిలిచారు. ప్రజాభిప్రాయానికి తలవంచిన ప్రభుత్వం థర్మల్‌ పరిశ్రమ నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. మంగళ వారంతో ఈ ఘటనకు పదేళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం. 


సువిశాల బీల ప్రాంతంలో థర్మల్‌ పరిశ్రమ ఏర్పాటుకు ఎన్‌సీసీ యాజమాన్యానికి నాటి ప్రభుత్వం అనుమతిచ్చింది. దీనిపై స్థానికుల అభ్యంతరాలను సైతం పట్టించుకోకుండా 2010 జూలై 14న పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపనకు సన్నాహాలు చేస్తున్నారు. పోలీస్‌ బలగాల నడుమ  కార్యక్రమ ఏర్పాట్లు చేయగా.. భూముల కోసం, సహజ వనరుల సంరక్షణ కోసం వేలాది మంది ఆ ప్రాంతానికి వచ్చి నిరసన తెలిపారు. అయినా ఎన్‌సీసీ యాజమాన్యం వెనక్కి తగ్గలేదు. దీంతో ఉద్రిక్త పరిస్తితులు తలెత్తాయి. ఒక్కసారిగా పోలీసులు, ఎన్‌సీసీ యాజమాన్యం ఏర్పాటుచేసిన వ్యక్తులు ఆందోళనకారులపై దాడులకు దిగారు. పోలీసులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో గున్న జోగారావు, గొనప కృష్ణమూర్తి, బెందాళం కృష్ణమూర్తి అనే ముగ్గురు రైతులు మృతిచెందారు. ఈ ఘటన తరువాత థర్మల్‌ ఉద్యమం ఉధృతమైంది. తరువాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి 1107 జీవోను రద్దుచేశారు.

Updated Date - 2020-07-14T10:20:38+05:30 IST