కొడుకు కొంప ముంచిన తండ్రి.. అతిగా వీర్యదానం చేసి..

ABN , First Publish Date - 2021-02-23T00:59:49+05:30 IST

ఆ తండ్రి యవ్వనంలో ఉండగా కనబరిచి ‘దాతృత్వం’ కొన్నేళ్ల తరువాత అతడి కొడుకు కొంప ముంచింది. డేటింగ్ అంటేనే భయపడే స్థితికి తీసుకొచ్చింది. తోడు కావాలని మనసు పోరు పెడుతునప్పటికీ.. తనపై ఆసక్తి కనబరిచి యువతులు వరుసకు సోదరీమణలు అవుతారనే భయంతో అతడు డేటింగ్‌కే దూరమయ్యాడు.. ఏంటీ కన్ఫ్యూజన్‌గా ఉందా.. అయితే మీకు పూర్తి స్టోరీ తెలియాల్సిందే!

కొడుకు కొంప ముంచిన తండ్రి.. అతిగా వీర్యదానం చేసి..

ఇంటర్నెట్ డెస్క్: ఆ తండ్రి యవ్వనంలో ఉండగా కనబరిచిన ‘దాతృత్వం’ కొన్నేళ్ల తరువాత అతడి కొడుకు కొంప ముంచింది. డేటింగ్ అంటేనే భయపడే స్థితికి తీసుకొచ్చింది. తోడు కావాలని మనసు పోరు పెడుతునప్పటికీ.. తనంటే ఇంట్రెస్ట్ చూపి్స్తున్న యువతులు తనకు తొడపుట్టిన వారు అయ్యుండచ్చనే భయంతో అతడు డేటింగ్‌కే దూరమయ్యాడు.. ఏంటీ కన్ఫ్యూజన్‌గా ఉందా.. అయితే మీకు పూర్తి స్టోరీ తెలియాల్సిందే! జేవ్ ఫోర్స్ వయసు 24 ఏళ్లు. అమెరికాలో ఓరేగావ్ రాష్ట్రంలో నివసిస్తుంటాడు. అందరి యువకుల్లాగే తనకూ ఓ గర్ల్‌ఫ్రెండ్ ఉండాలని కోరుకుంటున్నాడు. తప్పులేదు..! అయితే.. డేటింగ్ అంటే చాలు వణికిపోతున్నాడు. ఎందుకుంటే..తను కలుసుకోబోయే అమ్మాయి తనకు సోదరి అయి ఉండొచ్చు. అతడి తండ్రి యుక్తవయసులో ఉండగా..ఏకంగా 500 వందల సార్లు వీర్య దానం చేశాడు. దీంతో ఆ రాష్ట్రంలోని అనేక మంది జేవ్ తండ్రి ద్వారా సంతానం పొందారు. 


అయితే..ఎవరు తన తండ్రి సంతానమో జేవ్ తెలుసుకోలేడు. ఆ వివరాలన్నీ చాలా సీక్రెట్‌గా ఉంటాయి. వీర్యదానానికి సంబంధించిన ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలే ఇందుకు కారణం. తన తండ్రి ద్వారా ఎవరు సంతానం పొందారు..ఆ సంతానం ఇప్పుడు ఏం చేస్తున్నారనేది చెప్పడం అసాధ్యం. ఇటువంటి వారు తమంతట తాముగా ముందకొస్తే తప్ప రహస్యం బయటపడదు. దీంతో..కళ్ల ముందు ఉన్న అమ్మాయి తనకు ఎక్కడ సోదరి అవుతుందో అనే భయంతో మనోడు అల్లాడిపోతున్నాడు. అన్నట్టు..జేవ్ ఇప్పటి వరకూ ఎనిమిది మంది తోబుట్టువులను గుర్తించాడట. తండ్రి ‘దాతృత్వం’ కారణంగా రాష్ట్రంలో అనేక మంది తనకు తోబుట్టువులు అయి ఉంటారని జేవ్ భావిస్తున్నాడు. అందుకే..తోడు కోసం మనసు తపిస్తున్నా కూడా మరోదారి లేక ఇలా ఇబ్బంది పడుతున్నాడు. పాపం.. జేవ్!

Updated Date - 2021-02-23T00:59:49+05:30 IST